ఒక్క వాష్ లో ట్యాన్ పోగొట్టే అద్భుతంగా ఉపయోగపడే చిట్కా ఇదే..!
దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు,ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ కలబంద గుజ్జు,ఒక స్పూను శనగపిండి వేసి బాగా కలపాలి. వచ్చిన మిశ్రమాన్ని అప్లై చేయడానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ అప్లై చేసి అరగంటసేపు ఆరనివ్వాలి.ఇలా బాగా ఆరిన తర్వాత మెల్లగా మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవాలి.టాన్ అయిపోయిన ప్రతిభాగంలోనూ యూస్ చేసుకోవచ్చు. ఇలా వారానికి రెండు నుంచి మూడు రోజుల వరకు చేయడంతో,నెల రోజుల్లో మీ స్కిన్ మరింత అందంగా, మెరుగ్గా తయారవుతుంది.అంతేకాక ఎవరైనా ఫంక్షన్ లో అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకోవాలన్నా ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.జిడ్డు చర్మం కలవారికైతే అద్భుతమైన వరం అని చెప్పవచ్చు.
బొప్పాయిలోని ఎంజైమ్‌లు డెడ్ స్కిన్‌ని తొలగించి,డార్క్ స్పాట్స్‌ని తగ్గిస్తాయి.ఇందులో బీటా - కెరోటిన్ పుష్కళంగా ఉంటుంది.అందువల్ల ట్యాన్ పోగొట్టి ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.మరియు మృత కణాలను తొలగించడమే కాక చర్మానికి తేమనందిస్తుంది. దీంతో చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
కావున మీరు కూడా టాన్ కారణంగా బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.