మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. క్యాన్సర్ లక్షణాలే..?
అసలు సర్వైకల్ క్యాన్సర్ మహిళలు వారి శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా ముందుగా కనిపెట్టుకోవచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అలా వారు అవగాహన తెచ్చుకుంటే వ్యాధి ముదరకనే వారిని కాపాడుకోవచ్చు అని సూచిస్తూ ఉన్నారు.అసలు స్త్రీలలో ఎలాంటి లక్షణాలు సర్వైకల్ క్యాన్సర్ కి దారితీస్తాయో మనము తెలుసుకుందాం పదండి..
అంతే కాక మొదటి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స చేయడం కూడా సులభతరం అవుతుంది.మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలను చూసినట్లయితే ఋతుక్రమణ సమయంలో విపరీతంగా రక్తస్రావం అవుతుంది.మరియు రక్తస్రావం లో కూడా గడ్డలు గడ్డలుగా పడిపోవడం,నిరంతరం పొత్తికడుపులో నొప్పి రావడం,యోని భాగంలో గడ్డలుగా అనిపించడం,పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా తేలికపాటి రక్తస్రావం కావడం,లేదా బ్లడ్ డ్రాప్స్ కనిపించడం కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణాలుగా భావించాలి.
మరియు సెక్స్ చేసిన తర్వాత బ్లీడింగ్ కావడం,ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావడం,ఏవైనా లైక్విడ్స్ యోని నుండి స్రావాలు కారడం,మరియు ఆ స్త్రావాలు దుర్వాసన రావడం,పెల్విక్ పెయిన్,మెనోపాజ్ తర్వాత కూడా ఓవర్ బ్లీడింగ్ ఇవన్నీ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలుగా భావించాలి.కావున ప్రతి స్త్రీ ఇలాంటి అవగాహన తెచ్చుకొని,ఒక వేళ ఇక ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎటువంటి ఇంటి చిట్కాలు పాటించడం,సాధారణ rmp చేత ట్రీట్మెంట్ చేయించుకోవడం వంటివి చేయకుండా గైనకాలజిస్ట్ సలహా తీసుకోవడం చాలా ఉత్తమం.