పచ్చి శనగలు ఇలా తింటే ఏ జబ్బు రాదు?

Purushottham Vinay
పచ్చి శనగలు గురించి అందరికి తెలిసిందే. వీటిని టైం పాస్ కి ఒక్కటి తింటే ఇంకా అలాగే తినాలనిపిస్తుంది. పైగా ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మంచి స్నాక్స్ లా వీటిని తినొచ్చు.వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. పచ్చి శనగలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పచ్చి శనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు పచ్చి బఠాణీలను నిర్భయంగా తినవచ్చు. షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న భయం ఉండదు.పచ్చి శనగలు తక్షణ శక్తినిచ్చే పోషకాహారం. పచ్చి శనగలు తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు. ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది. పని చేయడానికి తక్షణ శక్తిని ఇస్తుంది. పచ్చి శనగల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.


జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే, ఖచ్చితంగా నానబెట్టిన పచ్చి శనగలు తినాల్సిందే. అంతేకాకుండా, పచ్చి శనగలు బరువును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.ప్రోటీన్ ఉండే వెజిటబుల్స్‌లో శనగలు ముఖ్యమైనవి. పచ్చి శనగల్లోని ప్రొటీన్ కండరాల నిర్మాణానికి, శరీర  విధులకు, రక్త ప్రసరణలో సహాయపడుతుంది. పచ్చి శనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారం శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పచ్చి శనగలు క్రమం తప్పకుండా తినడం వల్ల జ్వరం, జలుబు వంటివి దరిచేరవు.నాన బెట్టిన పచ్చి శనగలను పోషకాహార పవర్‌హౌస్‌ అని అంటారు. పచ్చి శనగలను నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  శరీరానికి ఇలా చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ఖచ్చితంగా ఇలా నాన బెట్టిన పచ్చి శనగలని ఖచ్చితంగా తినండి. ఎల్లప్పుడూ ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: