రైస్ వాటర్ చేసే మేలు తెలిస్తే వదలరు?

Purushottham Vinay
ఆసియా ఖండంలో ఎక్కువగా రైస్ ని తింటూ ఉంటారు.అయితే అన్నం వండటానికి ముందు రైస్‌ను రెండు, మూడు సార్లు కడుగుతారు. ఆ నీళ్ళని ఎక్కువగా పారబోస్తారు.అయితే రైస్ వాటర్ లో ఉన్న మినరల్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రైస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు ఆ వాటర్ ని ఇకపై  పారబోయరు.బియ్యం కడిగిన నీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ నీటిని తాగడం వల్ల వాంతులు లేదా జ్వరం వంటి ఏవైనా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.బియ్యం కడిగిన నీళ్లలో నారింజ తొక్క, నిమ్మతొక్క కలిపి తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండాకాలంలో ముఖం నల్లబడితే అలోవెరా జెల్, రోజ్ వాటర్ కలిపి బియ్యం కడిగిన నీళ్లలో బాగా కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా పెరుగుతుంది.రైస్ వాటర్‌లో ఉప్పు, నెయ్యి, ఎండుమిర్చి కలిపి తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది.


వేసవి కాలంలో రైస్ వాటర్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా మంచి హోం రెమెడీ కూడా.స్త్రీలు తెల్ల రుతుక్రమం సమస్యతో బాధపడుతుంటే ఈ రైస్ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే ఈ సమస్య నుంచి బయటపడతారు. బియ్యం కడిగిన నీరు తాగడం వల్ల మంట, విరేచనాలు తగ్గుతాయి. వేసవి కాలంలో చెమట పొక్కుల సమస్యకు బియ్యం కడిగిన నీటితో స్నానం చేయడం ప్రభావవంతంగా ఉంటుంది.ముఖం ఎర్రబారడం, చర్మానికి అలర్జీలు వంటి సమస్యలు ఉంటే బియ్యం నీటితో ముఖం కడుక్కోవడంతో ఫలితాలు ఉంటాయి. బియ్యం కడిగిన నీటిని జుట్టుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రైస్ వాటర్‌లో లావెండర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి మీ జుట్టును కడగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.బియ్యం కడిగిన నీటిని కాటన్ లేదా శుభ్రమైన గుడ్డతో ముఖంపై అప్లై చేయడం వల్ల ముఖం మెరుస్తుంది.బియ్యం కడిగిన నీటిని స్కిన్ ఫేషియల్ గా ఉపయోగించవచ్చు. కాబట్టి రైస్ వాటర్ ని అస్సలు పారబోయకుండా ఉపయోగించుకోండి. నిత్యం ఎంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: