మామిడి ఇలా తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు?

Purushottham Vinay
మామిడికాయ ప్రియులకి సీజన్ వచ్చింది.ఇక పండగే పండగ.ఎండాకాలంలోనే దొరికే ఈ పండుని ఎంతో ఇష్టంగా తింటారు.ఈ పండుని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు.అందుకె పండ్లలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఇది మన భారతదేశపు జాతీయ ఫలం.తినే పండ్లలో ఇది రాజు.వీటిలో అనేక రకాల పండ్లు ఉన్నాయి.ఈ పండులో విటమిన్ C పుష్కళంగా ఉంటుంది.అంతేకాదు కాల్షియం కూడ ఎక్కువే.ఇది శరీరంలో చెక్కెర స్థాయిని మెతుగుపరుస్తుంది.వేసవిలో సంభవించే అనారోగ్యాలు ఈ కాయ తినడం వల్ల దరి చేరవు.ఈ మామిడికాయ ముక్కలకి కాస్త ఉప్పు చల్లి ముక్కల్ని తింటే ఎండాకాలంలో అధిక దాహన్ని అదుపుచేయొచ్చు.విరోచనాలు మలబద్ధకంలాంటి సమస్యలని అరికట్టవచ్చు.ఇందులో ఉన్న విటమిన్ C వికారానికి వాంతులకి బాగా పని చేస్తుంది.గర్భిణీగా ఉన్నపుడు ఈ వికారానికి వాంతులకి మామిడికాయని తినడం ఒక మంచి చిట్కా అని చెప్పొచ్చు.ఇందులో మనకి కెరొటీన్ కూడా లభిస్తుంది.ఇందులో రకాలు కూడా ఉన్నాయి. బంగినపల్లిమామిడిపండు,రసాలు,చిన్నరాసలు,పెద్దరసాలు,చిత్తూరుమామిడి,కొబ్బరిమామిడి,సోరమామిడి,ఇలా పలురకాల పేర్లతో పిలుస్తారు..



వీటిని జ్యూస్ చేసి కూడా తీసుకుంటారు.ఒకే సీజన్ లో దొరికే ఈ కాయని నిల్వ పచ్చడిగా పెట్టుకొని సంవత్సరం పాటు తింటారు.ఈ ఆవకాయతో పెరుగన్నం బలే రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడితో తింటే ఆ రుచే వేరు.మామిడికాయతో పులిహోర చేస్తే రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.దీనిలో ఉండే విటమిన్ B శరీరానికి సంభందించిన సమస్యలని నివారిస్తుంది.ఈ కాయలో ఉండే మెగ్నీషియం ముఖంలో జిడ్డుని తగ్గించి మొటిమలు వాటి వల్ల వచ్చే మచ్చలను పోగొడుతుంది.ఎండవేడికి శరీరం అలసిపోకుండా కాపాడుతుంది.ఇలాంటి ఎన్నో మంచి పోషకాలు కలిగిన మామిడి కాయని మనం ఎలా తీసుకున్న మనకి మేలే జరుగుతుంది.అందుకే ప్రతిఒక్కరు ఈ కాయని అంత ఇష్టంగా తింటారు.రుచికి రుచి అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ పండు తినడం వల్ల మనకు కలిగే లభాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: