ఇలా ఇడ్లీ చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటారు?
ఇడ్లీ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఎందుకంటే దీని తయారీకి నూనె అవసరం లేదు.ఈ రకంగా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది.ఇడ్లీలో పీచుపదార్థం ఉంటుంది.దీనిని తరచుగా చట్నీలు లేదా సాంబార్‌లతో తింటారు. అలా శరీరానికి పీచు పదార్థం అందుతుంది.ఇడ్లీ సాధారణంగా గ్లూటెన్ రహిత ఆహారం. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.ఇడ్లీలో సహజంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండెకు ఆరోగ్యకరమైన ఎంపిక.ఇడ్లీల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.ఇడ్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. గుండె, లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి.కావాల్సిన అమైనో యాసిడ్స్ సులభంగా అందుతాయి.జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది.ఇడ్లీని పులియబెట్టిన బియ్యం పిండితో తయారు చేస్తారు. ఇది కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.ఇడ్లీని పులియబెట్టడం వల్ల విటమిన్ బి లభ్యత పెరుగుతుంది.
ఇక ఇడ్లీ కార్బోహైడ్రేట్లకు చాలా మంచిది. ఇది రోజువారీ కార్యకలాపాలకు శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇతర అల్పాహార ఎంపికలతో పోలిస్తే ఇడ్లీలో కేలరీలు చాలా తక్కువ. బరువు తగ్గడానికి ఇది సరైన ఆహారం.ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉంటాయి.బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.ఒక ఇడ్లీలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి.అయితే ఇడ్లీలు తెల్లగా ఉండాలని పొట్టు తీసిన మినప పప్పు వినియోగాస్తారు. అలానే తెల్లటి బియ్యపు రవ్వ వాడతారు.ఇలా చేయడం వల్ల ఆ ధాన్యాల్లోని పోషకాల్ని కొంతమేర నష్టపోతాం. ఇడ్లీ తయారి కోసం బియ్యపు రవ్వ కాకుండా బ్రౌన్ రైస్ వాడితే బి విటమిన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి.పైగా ఈ ఇడ్లీ అనేది చాలా ఈజీగా అరిగే టిఫిన్ కూడా ఇదే. అందుకే ఇడ్లీ తిన్న రోజు మనకు త్వరగా ఆకలి వేస్తుంది. మినప పప్పు, బియ్యం మిశ్రమంతో చేసే ఇడ్లీలను మన ప్రాంతంలో ఎక్కువగా తింటూ ఉంటారు.