మీకు ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉందా.. అయితే ఇది తెలుసుకోండి?

praveen
సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఉండే కొన్ని కామన్ అలవాట్లు కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి అలవాట్లలో ఒకటి ముక్కులో వేలు పెట్టుకోవడం కూడా ఒకటి. సాధారణంగా చిన్నపిల్లలు నోట్లో ముక్కులో వేలు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వయసు పెరిగేకొద్ది చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఈ అలవాటును మార్చుకుంటారు. అయితే కొంతమంది పెద్దవారిలో కూడా ఇలా ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది.

 పెద్దవాళ్లకంటే యంగ్ టీనేజర్స్ లో అయితే ఈ అలవాటు మరింత ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఇలా ముక్కులో వేలు పెట్టుకోవడం ఇక ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై నిర్వహించిన పరిశోధనలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా పెద్దవాళ్లకంటే యంగ్ టీనేజర్స్ లోనే ఈ అలవాటు ఎక్కువగా ఉంటుందని హెల్త్, న్యూరో సైన్స్ పరిశోధకులు అధ్యయనంలో తేల్చారు. అయితే ఈ అలవాటు అనేది అంత ప్రమాదకరమైనది కాదు అంటూ చెబుతున్నారు పరిశోధకులు. కానీ ఇక ముక్కులో వేళ్ళు పెట్టుకోవడం కారణంగా అయిన గాయం మానకపోవడం ముక్కలు కణజాలాలకి రంధ్రాలు పడటం ముక్కుపుటాలకు గాయాలు అవడం లాంటి ఘటనలు ఇక వీరి అధ్యయనంలో వెలుగు చూసాయట.

 అదే సమయంలో ఇలా ముక్కులో వేలు పెట్టుకునె అలవాటు ఉంటే మాత్రం వెంటనే ఆ అలవాటును మానుకోవడం మంచిది అని చెబుతున్నారు డచ్ పరిశోదకులు. ఎందుకంటే ఇలాంటి అలవాటు కారణంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉంటుందని.. వారి అధ్యయనంలో వెళ్ళడైందట. అయితే కొంతమంది కేవలం ముక్కులో వేలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా బైక్ తాళాలు, పెన్సిల్ లాంటివి కూడా పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం వల్ల ముక్కులోనే కణజాలం దెబ్బ తినే ప్రమాదం ఉంటుందట. ముక్కులో ఉండే మలినాలను తొలగించడానికి లేదా దురద వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలాంటి అలవాటు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు.. ఎవరైనా చెప్పినప్పుడు మాత్రమే ఇది తెలుసుకుంటారట. అయితే ఇలా ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్నవారికి గోర్లు కొడకడం, జుట్టు పీక్కోవడం లాంటి అలవాట్లు కూడా ఉండే అవకాశం ఉందని పరిశోధనల్లో వెళ్లడయింది అంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: