రోజు ఈ డ్రింక్ తాగారంటే ఏ రోగం మీ దరి రాదు?

Purushottham Vinay
జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కేవలం ఆహారానికి రుచిని మాత్రమే అందించడమే కాకుండా మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ఈ జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందు వలన అధిక బరువు చాలా ఈజీగా తగ్గడంలో కూడా మనకు ఈ జీలకర్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కాబట్టి దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి.జీలకర్ర కలిపిన నీరు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ నీటి వల్ల కలిగే మేలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.గర్భధారణ సమయంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో జీలకర్ర నీరు కూడా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వుల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. జీలకర్రలోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. జీలకర్ర టైప్ 2 డయాబెటిస్‌లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది.



జీలకర్రలో ఉండే ఐరన్, పీచు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, సీజనల్ వ్యాధులతో పోరాడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. మరే ఇతర జంక్ ఫుడ్ తినకుండా చేస్తుంది.శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో జీలకర్ర సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీలకర్ర నీరు తాగటం వల్ల శరీరం కొత్త, ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. జీలకర్ర నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక టీస్పూన్ జీలకర్రలో ఏడు నుంచి ఎనిమిది కేలరీలు మాత్రమే ఉంటాయి.జీలకర్రలో పాలీఫెనాల్స్, శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించే అనేక ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల జీర్ణ సమస్యలను దూరం చేయడంలో జీలకర్ర నీరు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. మంచి జీర్ణవ్యవస్థ సమర్థవంతమైన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియ జీవక్రియ రేటును మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో కూడా జీలకర్ర నీరు అద్భుతంగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: