నిద్రలేమి కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి, అధిక రక్తపోటు, బలహీనమైన జ్ఞాపకశక్తి ఇంకా అలాగే దృష్టి లేకపోవడం వంటి సమస్యలకు ఖచ్చితంగా దారి తీస్తుంది.సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, అలసట ఇంకా అలాగే మానసిక కల్లోలం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం నిద్రలేమి సమస్యకి చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.యాపిల్స్‌లో ఫైబర్, నేచురల్ షుగర్స్ ఉంటాయి, ఇవి మన శరీరంలో బ్లడ్ షుగర్‌ని మెయింటెయిన్ చేయడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.బొప్పాయిలో విటమిన్ సి, ఇ, ఫోలేట్ , పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పొటాషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియ వల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది.
నారింజ అనేది యాంటీ ఆక్సిడెంట్లకు పెట్టింది పేరు. అలాగే ఇందులోని విటమిన్ సి నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతంది.అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉండే కివిలో సెరోటోనిన్ ఇంకా పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.అలాగే చెర్రీలు కూడా నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిలోని మెలటోనిన్ అనే హార్మోన్, నిద్ర చక్రాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మంచి నిద్రకు ఈ హార్మోన్ చాలా అవసరం. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.అరటిపండ్లు విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలను కలిగి ఉండటం వల్ల నిద్రలేమి నుండి ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ B6 శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది, ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.