బెండకాయలు తింటే ఈ రోగాలన్నీ పరార్..!!
బెండకాయలలో ఉండే విటమిన్స్ విషయానికి వస్తే..A,C,K తో పాటు క్యాల్షియం, పొటాషియం ,ఐరన్ వంటిది పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలు అతి తక్కువ క్యాలరీలు కలిగి ఉండడం వల్ల ఎక్కువ గా తినవచ్చు.
బెండకాయలలో ఉండే పీచు పదార్థాలు డయాబెటిస్ రోగులను రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల వీరికి ఎక్కువగా ఆకలి అనేది వేయకుండా చేస్తాయి.
బెండకాయలలో ఉండేటువంటి పీచు పదార్థం వల్ల చెడు కొలెస్ట్రాలను కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే మలబద్ధక సమస్యను కూడా నివారించడానికి బెండకాయలు ఉపయోగపడతాయి.
బెండకాయలలో ఉండేటువంటి విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
బెండకాయలలో ఉండే ఫోలేట్ వల్ల గర్భిణీ స్త్రీలు వీటిని తినడం చాలా మంచిది.
బెండకాయలలో విటమిన్ K ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాది.
బెండకాయలలో ఉండేటువంటి బీటా కెరీటం కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుందట.
బెండకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ వంటి కణాలను సైతం పెరగకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
బెండకాయలలో గుండె విటమిన్-C వల్ల చర్మం జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేలా చేస్తుంది.
లేత బెండకాయలు తినడం వల్ల ఎక్కువగా అందులో పోషకాలు ఉంటాయి.. బెండకాయలను ఎన్ని విధాలుగా అయినా సరే మనం తినవచ్చు. అయితే ఎక్కువ సేపు ఉడికించి తినడం వల్ల అందులో పోషకాలు నశిస్తాయి