ఈ పండ్లు మధుమేహులకు వరం లాంటివి?

frame ఈ పండ్లు మధుమేహులకు వరం లాంటివి?

Purushottham Vinay
షుగర్ పేషెంట్స్ సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోంది.. చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా చాలామంది ఈ రోజుల్లో మధుమేహం బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలి అని తెలుస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డారంటే  చనిపోయే వరకు పట్టిపీడిస్తూనే ఉంటుంది.. అయితే.. మంచి జీవనశైలి, ఆహారంతో ఈ వ్యాధిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రక్తంలో చక్కెర పరిమాణం పెరగకుండా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.. అందుకే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం, పానీయాలపై ఖచ్చితంగా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు పండ్లు తినడం మంచిది కాదని చాలా మంది చెబుతారు. అయితే, కొన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం వరమని వాటిని తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిని తినడం ద్వారా రక్తంలో చక్కెరను చాలా ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు.ఇక క్రాన్‌బెర్రీ పండ్లలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.


మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉదయం పూట ఈ పండును తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.ద్రాక్ష రుచికరమైనది మాత్రమే కాదు.. వాటిలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.చెర్రీస్‌లో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.స్ట్రాబెర్రీల మాదిరిగానే రాస్ప్‌బెర్రీస్‌లో కూడా ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వీటిలో రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న స్ట్రాబెర్రీలను తినాలి.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ 5 రకాల పండ్లలో ఏదైనా ఒకదాన్ని రోజూ తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులలో బ్లడ్ షుగర్ పెరగదు… ఇంకా కంట్రోల్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: