చప్పట్లు కొట్టడం వల్ల.. ఇన్ని ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చా?
ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు అందరూ కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కల్తీ వచ్చేసిన నేపద్యంలో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు. అయితే ఆరోగ్యం పై శ్రద్ధ వహించడానికి ఏదో కొత్తగా చేయాల్సిన పనిలేదు. కొన్ని కొన్ని సార్లు మనం రోజు అలవాటుగా చేసే పనులే ఇక ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి అనే విషయాన్ని నిపుణులు చెప్తే విని అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.
ఏకంగా చప్పట్లు కొట్టడం వల్ల కూడా మనకి ఎంతో మంచి జరుగుతుందట. మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చప్పట్లు కొట్టడం వల్ల కండరాల్లో రక్త ప్రసరణ పెరుగుతుందని ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు నిపుణులు. మెడ వెన్ను కీళ్ల నొప్పులనుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అని అంటున్నారు. అంతేకాదు ఒత్తిడితో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రభావం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నడుమును నిటారుగా ఉంచి శరీరాన్ని పైకి లాగే చప్పట్లు కొడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.