సన్నగా ఉన్నారా? ఇలా చేస్తే బలంగా అవుతారు?

Purushottham Vinay

మన ఎత్తు, వయసు, లింగం ఆధారంగా ఎంత బరువైతే ఉండాల్సిన అవసరం ఉంటుందో అంత ఉండటం అన్ని విధాల శ్రేయస్కరం మాత్రమే కాదు చాలా అవసరం కూడా. చాలా మంది సన్నగా ఉంటారు. దానివల్ల ఖచ్చితంగా అనేక రకాల అవమానాలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలనుకుంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఖచ్చితంగా పాటించండి. ఆరోగ్యకరమైన బరువు పెరుగుతారు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీ ఆహారంలో ఖచ్చితంగా ఎర్ర దుంపలు, ఆప్రికాట్లు, తృణధాన్యాలు, స్క్వాష్, ఎండుద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరాలు, బీన్స్, మొక్కజొన్న, బంగాళాదుంపలు బీన్స్, కాయధాన్యాలు మొదలైనవి ఎక్కువగా తినండి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాలు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు మొదలైనవి తాగడం వల్ల శరీరానికి సరిపడా కేలరీలు మీ బాడీకి అందుతాయి. 


ఇవి మీరు బరువు పెరిగేందుకు చాలా బాగా దోహదపడతాయి. ఇంకా వీటన్నింటితో పాటు కండరాలు పెరగాలంటే వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం.ఖాళీ కడుపుతో ఖచ్చితంగా క్యారెట్ జ్యూస్ తాగాలి. ఎందుకంటే ఇది పేగులోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది, ఇది పోషకాలను సరిగ్గా గ్రహించడంలో ఎంతగానో సహాయపడుతుంది.రోజుకు మూడుసార్లు భారీ ఆహారం ఇంకా రెండుసార్లు తేలికపాటి ఆహారం తీసుకోండి. అలాగే, ప్రతి భారీ భోజనం తర్వాత అల్పాహారం కోసం కొన్ని గ్రానోలా బార్లు లేదా డోనట్స్ ఖచ్చితంగా తీసుకోండి.తల్లిదండ్రులు తమ పిల్లల సన్నబడటం గురించి తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ ఇలా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే చాలా సులభంగా బరువు పెరగవచ్చు. బరువు పెరగాలి అంటే శరీరానికి అవసరమైన కేలరీల కంటే సుమారు ఒక వెయ్యి కేలరీలు ఎక్కువగా తీసుకోవడం అవసరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ ఖచ్చితంగా పాటించండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఇంకా హెల్తీగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: