18 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతసేపు నిద్రపోతే మంచిది.. ఈ విషయం తెలుసుకోండి?
ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా ముఖ్యం. ఒక్కొక్క వయస్సులో ఒక్కోలా నిద్ర అవసరం ఉంటుంది. పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరమైతే, పెద్దలకు తక్కువ నిద్ర సరిపోతుంది. ఇటీవల ఒక నెటిజన్ ఏజ్ గ్రూప్స్ ప్రకారం ఎవరు ఎంత సేపు నిద్రపోవాలో చెప్పాలని అడిగారు. దానికి ఒక డాక్టర్ సలహా ఇస్తూ 65 సంవత్సరాలకు పైగా ఉన్న పెద్దలకు రాత్రికి 7-8 గంటల నిద్ర చాలా అవసరమని చెప్పారు. అయితే, చాలా మంది పెద్దలు పగటిపూట 2 గంటల నిద్రతో కలిపి రాత్రికి 5-6 గంటల నిద్ర మాత్రమే పొందినా ఆరోగ్యంగానే ఉండగలరు.
వయస్సు పెరిగేకొద్దీ స్లీప్ ప్యాట్రన్స్‌లో మార్పులు రావడం సహజం కాబట్టి, ఈ రకమైన సౌకర్యవంతమైన నిద్ర పద్ధతి పెద్దలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల పెద్దలకు రాత్రికి 7-8 గంటల నిద్ర చాలా ముఖ్యమని డాక్టర్ స్పష్టం చేశారు. ఈ వయసులో సరిపడా నిద్ర మనస్సు పనితీరు, మానసిక ఆరోగ్యం, మొత్తం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మతిమరుపు, ఏకాగ్రత తగ్గడం, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరగడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మరోవైపు, పిల్లలు వేగవంతమైన శారీరక, మానసిక అభివృద్ధికి పెద్దల కంటే ఎక్కువ నిద్ర అవసరం. పిల్లలకు సరిపడా విశ్రాంతి తీసుకోవడం అనేది వారి గ్రోత్, లెర్నింగ్, మొత్తం శ్రేయస్సుకు చాలా ముఖ్యం.
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, మేల్కొనండి.
పడుకునే ముందు కెఫిన్, ఆల్కహాల్‌ను తీసుకోకుండా జాగ్రత్త పడాలి. పడుకునే ముందు రిలాక్సేషన్ టెక్నిక్‌లను అభ్యసించండి. మీ పడకగదిని చల్లగా, చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉంచండి. మీరు నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే, మీ డాక్టర్‌తో మాట్లాడండి. ఎక్కువకాలం నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి త్వరగా ఈ సమస్యను ఓవర్‌కమ్ చేసేందుకు ప్రయత్నించాలి.