ఈ రోజుల్లో చాలా మంది జనాలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఎన్నో పనులతో బిజీగా గడిపేస్తుంటారు. ఇటు ఇంట్లో పనులు ఇంకా అటు ఆఫీస్ పనులు చేసుకుని మనకంటూ మనం సమయాన్ని కేటాయించుకోలేకపోతుంటాం.ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ కానీ కాలం గడిచినా తర్వాత అదే మనం చేసిన పెద్ద తప్పు అవుతుంది. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రతిరోజు మన కోసం మనం ఎంతో కొంత సమయాన్ని మన ఆరోగ్యం కోసం కేటాయిస్తూ ఉండాలి. ఈ బిజీ జీవితంలో కనీసం ఒక అరగంట లేదా గంట అయినా మన కోసం మన ఆరోగ్యం కోసం కేటాయిస్తూ ఉండాలి. సమయం అంటే ఊరికే ఫోన్ పట్టుకుని కూర్చోవడం, టీవీ లు చూడటం కన్న, ఆరు బయట పచ్చని చెట్ల మధ్యకి వెళ్లి పార్కులోనో లేదా ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశంలోనో వాకింగ్ మరియు యోగ, మెడిటేషన్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
ఊరికే నడవడం వల్ల ఏమొస్తుంది అని కొందరు అనుకుంటారు కానీ డైలీ నడవడం వల్ల మధుమేహం, బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు ఇలాంటి ఎన్నో రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. రోజు కుదిరితే గంట లేదా కనీసం అరగంట అయినా వాకింగ్, వయమ్యం, యోగ చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులే చెబుతున్నారు. పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతికి దగ్గరగా వాకింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి చాలా తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. యోగ, మెడిటేషన్ వల్ల కూడ బీపీ నియంత్రణ అవుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ , ఇన్ఫెక్షన్ బాగా పెరిగితే గుండె జబ్బులు, షుగర్ వంటి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దానివల్ల రక్తనాళాలు మరియు గుండె దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల గుండె కి రక్త ప్రవాహం తగ్గిపోతుంది. దానివల్ల భవిష్యత్తులో గుండెపోటు రావడానికి దారితీస్తుంది.