కీర దోస వల్ల కలిగే లాభాలు, నష్టాలు?
బరువు తగ్గడం కోసం కీర దోస చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కీరదోసలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ కీరదోస ఎక్కువగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా సంభవించవచ్చు. అవేంటంటే దీన్ని ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది. కీర దోసలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నొప్పి , బ్లోటింగ్కు దారితీస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ఇష్టంగా తినే వారు జాగ్రత్త గా ఉండాలి.ఈ కీరదోసలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రపిండ సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. ఇంకా అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలన్స్ అసమతుల్యతకు దారితీస్తుంది. పోషకాల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. కీర దోస ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని ఇతర పోషకాల శోషణను ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎక్కువగా తింటే డయేరియా వస్తుంది.కీరదోసలోని ఫైబర్ ఖచ్చితంగా డయేరియాకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది అస్సలు మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తింటే అలెర్జీలు కూడా వస్తాయి. కొంతమందికి కీరదోస ఎక్కువగా తినడం వల్ల అలెర్జీ రావొచ్చు. దీనివల్ల చర్మం డ్రై అయిపోతుంది.