పెసర పప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది.దీని కారణంగా చాలా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇందులో లభించే ఫైబర్ పొట్టను ఆరోగ్యంగా చేస్తుంది. పెసర పప్పులో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇంకా మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.పెసర పప్పులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇవి చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని ఇంకా చర్మాన్ని రక్షిస్తుంది. దీని కారణంగా ముడతలతో పాటు ఆయిల్ స్కిన్ సమస్యలు కూడా చాలా ఈజీగా దూరమవుతాయి.
ఇంకా అలాగే ఇందులో లభించే విటమిన్ B చర్మాన్ని ఆరోగ్యంగా చేసి మృదువుగా ఉండేలా చేస్తుంది. పైగా ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. దీని కారణంగా అన్ని రకాల జీర్ణక్రియ సమస్యల నుంచి ఈజీగా విముక్తి కలుగుతుంది.పెసర పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహం సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు పెసరపప్పును తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు ఈజీగా నియంత్రణలో ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. దీంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా చాలా సులభంగా దూరమవుతాయి.అలాగే పెసరపప్పులో క్యాన్సర్‌ను ఎదుర్కొనే గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పెసరపప్పును క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల చర్మం నిగారించేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది ఉపమోగపడుతుంది. ఇంకా అలాగే ఇన్‌ఫెక్షన్స్ దరి చేరకుండా చేయడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను కూడా పెసరపప్పు దూరం చేస్తుంది.