పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి, ఇ చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. ఈ పచ్చి బొప్పాయిలో ఉండే ఫైబర్ , పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది. పచ్చి బొప్పాయిలో సపోనిన్, బీటా కెరోటిన్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇంకా లైకోపీన్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎప్పుడు కాపాడతాయి. పచ్చి బొప్పాయి శరీరం నుంచి వ్యర్ధాలను చాలా సులభంగా దూరం చేస్తుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఇంకా అలాగే కామెర్ల వ్యాధిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.పచ్చి బొప్పాయి మాత్రమే కాదు దాని ఆకులలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల పచ్చి బొప్పాయి ముక్కలను తింటే మధుమేహం ఈజీగా అదుపులో ఉంటుంది. పచ్చి బొప్పాయి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలోని పోషకాల వల్ల నెలసరి సమస్యలు ఉండవు బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను రాకుండా బొప్పాయి కాపాడుతుంది. డెంగ్యూతో బాధపడే వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. పచ్చి బొప్పాయి ఆకుల్లో ఉండే సైటో టాక్సిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.పచ్చి బొప్పాయి తినడం వలన చర్మం పై ఉన్న సోరియాసిస్, మొటిమలు, స్కిన్ పిగ్మెంటేషన్, వంటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. తాజా ఆకుపచ్చ బొప్పాయి రసం తీసుకోవడం వలన ఎర్రబడిన టాన్సిల్స్‌కు చికిత్సగా పనిచేస్తుంది. పచ్చి బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వలన ఆస్తమా, ఆస్టియా ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగులకు సహాయపడుతుంది.బరువు తగ్గలనుకునే వాళ్లకి ఈ పచ్చి బొప్పాయి ఎంతగానో సహాయపడుతుంది. పేగులలో, కడుపులో ఇబ్బందికర పరిస్థితిని తగ్గించడానికి ఈ పచ్చి బొప్పాయి దివ్య ఔషాధంలాగా పని చేస్తుంది.