చిన్న చిన్న సమస్యలకు చెక్ పెట్టడానికి సంప్రదాయ చిట్కాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. దీని ద్వారా మెడిసిన్ నుండి వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఆ సంప్రదాయ చిట్కాలు ఏంటి ? ఆ సమస్యలేంటి ఓసారి చూద్దాం.మన నోటినీ ఎంత శుభ్రం చేసుకున్నప్పటికీ నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు ఎన్నో సమస్యలు వస్తూఉంటాయి. ఎన్ని రకాల పేస్టులు, క్రీములు, మెడిసిన్లు వాడిన సమస్య మాత్రం అలానే ఉంటుంది. దీనికోసం ప్రతిరోజు నాలుగు లేదా ఐదు పుదీనా ఆకులను తినడం వల్ల ఈ ఇబ్బంది నుండి బయట పడొచ్చు. అలాగే జలుబు అంత తొందరగా పోదు కాబట్టి… ఇలాంటప్పుడు మిరియాల చారు సూపర్ గా పని చేస్తుంది. లేదా పాలలో మిరియాల పొడి వేసుకొని తాగిన బెటర్. దీంతోపాటు మనం తినే ఆహారంలో మిరియాల పొడి తీసుకోవడం అలవాటు చేసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్య కూడ పోతుంది.బిపి కంట్రోల్ లో ఉండాలంటే మునగాకు పొడి ని తరచూ తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు చిటికెడు కోంచెం మునగాకు పొడి తీసుకుంటే బిపి ద్విషుగ్గా కంట్రోల్ లో ఉంటుందట. రక్తహీనత సమస్యకు తేనే అద్భుతమైన పరిష్కారం. ప్రతీరోజు వాడే చక్కర వినియోగాన్ని తగ్గించి… టీ కాఫీ ఇతర ఆహార పదార్థాల్లో తేనెను ఉపయోగిస్తే రక్తహీనత నుంచి బయటపడచ్చని సలహా. ఇక రక్తనాళాలు మందంగా ఉండి రక్త సమస్యల నుంచి ఎదుర్కొనే వాళ్ళు బీట్రూట్ రసాన్ని రోజు తాగితే చాలా మంచిది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె సమస్యలు కూడా అంత త్వరగా రావు.చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నాం. సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదే కానీ… ప్రతి చిన్న విషయానికి మెడిసిన్ తీసుకోవడం అంత మంచిది కాదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి.