ఈ చిట్కాలు పాటిస్తే ఇంట్లోకి దోమలు రానే రావు?
ఈ వర్షాల కాలంలో దోమలతో ఇబ్బంది పడుతున్నారా! ఇంకెందుకు ఆలస్యం దోమలను తరిమికొట్టడానికి ఇప్పుడు చెప్పే ఈ వంటింటి చిట్కాలని పాటించండి. దోమలు రానే రావు.అసలే వానకాలం చల్లగా,జోరుగా వానలు పడుతున్నాయి. రాత్రిపూట అలా కునుకు పడితే చాలు.. చెవు దగ్గర గుయ్ మంటూ దోమలు నానా హంగామా చేస్తాయి. ఇక అవి కుట్టాయంటేనా .. మన పని అంతే.. జ్వరం.. తలనొప్పి.. మనల్ని బాగా వేధిస్తాయి. మందుబిళ్లలు మింగి మళ్లీ మామూలు స్థాయికి చేరేందుకు ఓ వారం... పది రోజులు కచ్చితంగా పడుతుంది. ఒక్కోసారి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఇంతటి ప్రమాదకరమైన జీవి ఇంట్లో తిష్ఠ వేస్తే దానిని వంటింటి చిట్కాలతో ఎలా తరిమికొట్టాలో తెలుసుకుందాం. ఈ చిట్కాలు పాటిస్తే ఇంట్లోకి దోమలు రానే రావు..
వర్షాలు జోరుగా కురుస్తుండటంతో దోమలు బెదడ ఎక్కువయ్యి మరింత చికాకుకు పెట్టిస్తాయి. దోమల బెడద పెరిగితే రాత్రి నిద్రకు కూడా భంగం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో దోమలను తరిమికొట్టడం చాలా అవసరం. కానీ మార్కెట్‌లో లభించే దోమల నివారణలు నుంచి వెలువడే పొగ, వాసనను చాలా మంది తట్టుకోలేరు దాని వల్ల ఇంకా మరెన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వారు దోమలను సహజపద్ధతుల్లో తరిమికొట్టే మార్గాల గురించి తెలుసుకోవాలి.
నిమ్మకాయ, యూకలిప్టస్ నూనె : లెమన్ యూకలిప్టస్ ఆయిల్ దోమల సహజ వికర్షకాలలో ఒకటి. యూకలిప్టస్ నూనెలో కొద్దిగా నిమ్మకాయ రసం కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. 3 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు.
లావెండర్ పువ్వుల పొడి: దోమలను తిప్పికొట్టగల సువాసన, నూనెను ఉత్పత్తి చేస్తాయి. లావెండర్ అనాల్జెసిక్, యాంటీ ఫంగల్, యాంటి సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దోమల బెడదను అరికట్టడమే కాకుండా చర్మాన్ని సున్నితంగా తయారు చేస్తుంది.