బరువు తగ్గాలని ఒక్కసారిగా అన్నం మానేస్తున్నారా.. నిపుణులు ఏం చెప్తున్నారో వినండి?

praveen
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో చాలామంది ప్రజలు ఎలాంటి శారీరక శ్రమ లేకుండా జీవితాలను గడుపుతున్నారు. దీనివల్ల వారి బాడీలోని ఫ్యాటు, కేలరీలు ఖర్చు కావడం లేదు. వాటిని ఖర్చు చేయకపోవడం వల్ల అవి బాడీలో స్టోర్ అయిపోయి  లావుగా తయారవుతున్నారు. దీనికి తోడు ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతోంది. ఈ స్థూలకాయం సమస్య గుండెజబ్బులకు, డయాబెటిస్ వంటి రోగాలకు కారణం అవుతుంది.
ఇలా ఊబకాయంతో సఫర్ అవుతున్నవారు త్వరగా వెయిట్ లాస్ కావాలని ప్రయత్నిస్తుంటారు. ఎవరు ఏం చెప్పినా అది ఫాలో అయిపోతుంటారు. సాధారణంగా వెయిట్ తగ్గాలంటే అన్నం తినడం మానేయాలని చాలామంది సూచిస్తారు. అన్నానికి బదులుగా సిరి ధాన్యాలు తినడం మొదలు పెట్టాలని సలహా ఇస్తారు. పొట్టి కూడా తినమని చెబుతారు. అయితే ఈ సలహాని పాటించే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సిరి ధాన్యాలు చాలా పోషక విలువలు కలిగిన ఆహారాలు. అయినా ఒక్కసారిగా అన్నం మానేసి వీటిని తినడం మొదలు పెడితే బాడీ అడ్జస్ట్ కాకపోవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలు, కేలరీలు లభించకపోవచ్చు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజం చెప్పాలంటే అన్నం తినడం పూర్తిగా మానేసినంత మాత్రాన బరువు తగ్గిపోరు. వైట్ రైస్‌లో మన శరీరానికి కావలసిన పోషకాలు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే అన్నం తినడం పూర్తిగా మానేయకూడదు. త్వరగా వెయిట్ తగ్గాలని సడన్‌గా డైట్ చేంజ్ చేయకూడదు. ఒక క్రమ పద్ధతిలోనే వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి ఒక్కసారిగా అన్నం తినడం మానేయడం మళ్ళీ ఒకసారిగా అన్నం తినడం స్టార్ట్ చేయడం చేస్తే బరువు తగ్గడం మాట అటు ఉంచితే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన బాడికి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం కాబట్టి అన్నం తినడం పూర్తిగా మానేయకూడదు. నిదానంగా తగ్గే మార్గాలను మాత్రమే ఫాలో కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: