ఎక్కువ కాలం సెక్స్‌లో పాల్గొనకపోతే ఏమవుతుంది.. ఈ విషయం తెలుసుకోండి?
సాధారణంగా దంపతులు ఆరోగ్యాన్ని, అనుబంధాన్ని పెంచుకోవడానికి తరచూ లైంగిక కార్యకలాపాలలో పాల్గొంటారు. వీరి మధ్య సెక్స్ లేకపోతే రిలేషన్‌షిప్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ. ప్రెగ్నెన్సీ, పిల్లలు కన్నాక, మెనోపాజ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యాక మహిళల్లో సెక్స్‌పైన ఆసక్తి తగ్గుతుంది. వయసు పైబడుతున్న కొద్దీ ఆడవాళ్లలో కోరికలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఆడ మగ తేడా లేకుండా ప్రతి పదిమందిలో ఒకరికి శృంగారపు కోరికలు తగ్గిపోవడం జరుగుతోంది. ఫలితంగా వాళ్ళందరూ కూడా సెక్స్‌కు దూరంగా ఉంటున్నారు. నెలలు, సంవత్సరాలుగా సెక్స్‌లో పాల్గొనకపోతే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేవో చూద్దాం.
• ఆ హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి:
రీప్రొడక్టివ్ సిస్టమ్, యోని ఆరోగ్యం బాగా ఉండాలంటే శరీరంలో ఆక్సిటోసిన్, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు సరైన మోతాదులో ఉత్పత్తి కావాలి. అయితే సెక్స్ చేయని వారిలో ఈ రెండు హార్మోన్లు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలో ఎక్కువ కాలం ఉత్పత్తి కాకపోతే శాశ్వతంగా ఆ కోరికలు తగ్గిపోతాయి. ఫలితంగా శక్తి స్థాయిలు తగ్గుతాయి. మానసిక సమస్యలు పెరుగుతాయి.
• వజైనల్ ఇన్ఫెక్షన్లు:
సెక్స్‌కు దూరంగా ఉండే మహిళల్లో వజైనల్ ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. తరచుగా లైంగికంగా కలవకపోతే ప్రైవేట్ పార్ట్‌కు బ్లడ్ సర్కులేషన్ తగ్గుతుంది. దానివల్ల యోని పొడి బారుతుంది. ఎలాస్టిసిటీ లేదా సాగే గుణాన్ని కూడా కోల్పోతుంది. దీని కారణంగా మళ్లీ కలయికలో పాల్గొన్నప్పుడు తీవ్రమైన అసౌకర్యం, నొప్పి కలుగుతుంది. అందుకే సెక్స్‌కు పూర్తిగా దూరం కాకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
• తగ్గే ఇమ్యూనిటీ పవర్
నెలల తరబడి శృంగారానికి దూరంగా ఉన్నట్లయితే రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటుందని అంటున్నారు. వీక్లీ రెండుసార్లు అయినా కలయికలో పాల్గొనాలని, లేకపోతే వ్యాధులను తట్టుకునే సామర్థ్యం క్షీణిస్తుందని ఒక స్టడీ వెల్లడించింది.
• స్ట్రెస్ పెరిగిపోతుంది
సెక్స్ ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చని చాలామంది డాక్టర్లు చెబుతుంటారు. ఒకవేళ దీనికి దూరమైతే రోజువారి ఒత్తిడి మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఫలితంగా ఒత్తిడి ఆందోళన పెరిగిపోయి అనేక రకాల జబ్బులు వస్తాయి.
వ్యాయమాలు చేయడం, సెక్సువల్ ఫాంటసీల గురించి ఒకరికొకరు చెప్పుకోవడం, డైలీ కొంతసేపైనా ఏకాంతంగా గడపడం ద్వారా ఈ కోరికలను పెంచుకోవచ్చు.