దీన్ని పిచ్చి చెట్టని పట్టించుకోపోతే అద్భుత ప్రయోజనాలు కోల్పోతారు?

Purushottham Vinay

చాలా మంది కూడా మన ఇంటి దగ్గర పెరిగే జిల్లేడు చెట్టు పిచ్చి చెట్టు అని భావించి దాన్ని పీకి పడేస్తారు. కానీ ఆ చెట్టుతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.పేగులలో ఉండే పుండ్లు తగ్గడానికి జిల్లేడు ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే నరాల బలహీనతకు అస్తమా, రక్త ప్రసరణ సజావుగా జరిగేందుకు ఈ చెట్టుని ఉపయోగిస్తారు. అలాగే ఈ పువ్వు ఆస్తమా రోగులకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఈ పువ్వును దగ్గు నుండి ఉపశమనానికి కూడా ఉపయోగిస్తారు. క్యాన్సర్ నుండి ప్రజలను రక్షించడంలో ప్రభావవంతంగా ఉండే జిల్లేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ జిల్లేడు చిగుళ్లను తాటి బెల్లంతో కలిపి చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల మహిళకు ఎదురయ్యే పిరియడ్స్ నొప్పులు తగ్గుతాయి. జిల్లేడు ఆకు, పువ్వు రసాన్ని చెవిలో వేసుకోవడం వల్ల చెవి ఇన్ఫెక్షన్, మంట నుండి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఇది చెవి సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. అయితే కచ్చితంగా వైద్యుని సలహా లేకుండా చేయకూడదు. 


అంతేగాక వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఈ జిల్లేడు ఆకులతో తలనొప్పి ఇట్టే తగ్గుతుంది. ఈ ఆకుల పేస్ట్ ని నుదిటి మీద అప్లై చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఫైల్స్ తో బాధపడే వారికి ఈ చెట్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఆకు పువ్వు రసం మొటిమలు, దురద వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పువ్వులను పేస్ట్ చేసి చర్మంపై అప్లై చేయడం వల్ల మొటిమలు, దురద వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ జిల్లేడులో ఉన్న యాంటీ ఆక్సిడెట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేస్తాయి. మెత్తగా రుబ్బి తీసిన జిల్లేడు ఆకుల రసాన్ని ఒంటి మీద వాపులపై రాస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.మధుమేహానికి కూడా జిల్లేడు మంచి ఔషధంగా పనిచేస్తుంది.జిల్లేడు ఆకులు, వేర్లు, పూలు ఇంకా విత్తనాలలోని లక్షణాలతో మలబద్ధకం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: