వామ్మో ఇలాగైతే మీ కిడ్నీలు పాడైపోయినట్లే ?
కిడ్నీళ్లు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇవి రోజంతా నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటాయి. మన శరీరం నుండి మలినాలను ఫిల్టర్ చేయడానికి, వాటిని మూత్రం ద్వారా విసర్జించేలా చేయడం అనేది కిడ్నీల మెయిన్ టాస్క్.కిడ్నీ పనితీరు క్షీణించి, బాడీలోని టాక్సిన్ల తొలగింపు విధులు సక్రమంగా నిర్వహించలేనప్పుడు పలు రకాల కిడ్నీ వ్యాధులు అటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కిడ్నీ పనితీరు 90% తగ్గే దాకా లక్షణాలు కనపడకపోవచ్చు. కిడ్నీ పనితీరు తగ్గిన తర్వాతే ఎక్కువగా లక్షణాలు కనపడతాయి. ఇది కిడ్నీ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించడం చాలా కష్టం చేస్తుంది. కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.వాంతులు, అన్నం అస్సలు సహించకపోవడం, శరీరంలో దురద ఎక్కువ వస్తుంది.కిడ్నీలు సరిగా పని చేయకపోతే, శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి వాంతులు, అన్నం తినడంలో ఇబ్బంది, మరియు శరీరంలో దురద రావడం సాధారణం.మన శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల శ్వాస సమస్యలు ఎక్కువగా వస్తాయి.
కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు.యూరిన్‌లో రక్తం లేదా కోలా కలర్ అవుతుంది. యూరిన్‌లో రక్తం కనిపించడం లేదా యూరిన్ రంగు మారి కాఫీ రంగులో రావడం కిడ్నీ సమస్యలకు కచ్చితంగా సంకేతం కావచ్చు.అలాగే రాత్రిపూట యూరిన్ కోసం ఎక్కువ సార్లు లేవడం ఇందుకు సంకేతం కావొచ్చు. రాత్రిపూట ఎక్కువ సార్లు మలమూత్రాల కోసం లేవడం కూడా కిడ్నీ పనితీరు తగ్గిన సంకేతం కావచ్చు.ముఖ్యంగా చిన్న వయసులో హై బీపీ రావడం జరుగుతుంది. చిన్న వయసులోనే రక్తపోటు పెరగడం కిడ్నీ సమస్యలకు కచ్చితంగా సంకేతం కావచ్చు. ఎందుకంటే కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.కాళ్లు, ముఖం ఉబ్బడం కచ్చితంగా జరుగుతుంది. కిడ్నీలని సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల కాళ్లు, ముఖం శరీరంలోని ఇతర భాగాలు కచ్చితంగా ఉబ్బుతాయి.ఇక ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన పరీక్షలు చేయించి కిడ్నీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరు మెరుగుపరచుకోవచ్చు.