క్యాన్సర్‌ని తెలిపే మొదటి సంకేతాలు ఇవే..??
అలసట
క్యాన్సర్ రోగులలో అలసట కామన్‌గా కనిపించే లక్షణం. ఈ వ్యాధి బారిన పడ్డ వ్యక్తులు చాలా బలహీనంగా తయారవుతారు. మంచం నుంచి కూడా లేచి నిలబడలేరు. బాత్రూమ్‌కి వెళ్లలేరు, టీవీ రిమోట్ కూడా ఆపరేట్ చేయలేని దుస్థితికి చేరుకుంటారు. ఎంత ట్రై చేసినా ఈ అలసటను అధిగమించలేరు. చివరికి ఇది నొప్పి, వికారం, వాంతులు లేదా నిరాశను కూడా కలిగిస్తుంది.
వెయిట్ లాస్
క్యాన్సర్ ఉన్నవారు ఎలాంటి కారణం లేకపోయినా బరువు తగ్గుతారు. ఒకవేళ సడన్‌గా వెయిట్ లాస్ అయితే వెంటనే మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది.
రొమ్ములో మార్పులు
చనుమొన లేదా రొమ్ములో మార్పులు కనిపించినా లేదా గుంతల లాగా పడినా, ఫ్లూయిడ్స్ డిశ్చార్జ్ అవుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. ఇతర ప్రైవేట్ పార్ట్స్ లో వాపు కనిపించినా అది వివిధ రకాల క్యాన్సర్లకు కారణమై ఉండొచ్చు. మూత్రం పోసేటప్పుడు నొప్పి కలిగినా కూడా చెక్ అప్ చేయించుకోవడం మంచిది.
కళ్లలో నొప్పి
కళ్లను ఎవరో పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి కలిగితే క్యాన్సర్ కణాలు శరీరంలో పెరుగుతున్నాయని అర్థం.
తరచుగా తలనొప్పి
పొద్దస్తమానం తలనొప్పి తీవ్రంగా బాధిస్తుంటే అది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారికి తలనొప్పి తరచుగా వస్తుంది.
శరీరంపై దద్దుర్లు కనిపించడం
బ్లడ్ క్యాన్సర్ లుకేమియా బారిన పడితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. శరీరమంతా దద్దుర్లు ప్రత్యక్షమవుతాయి. భుజం చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలు చిట్టి పోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
బాధాకరమైన ఋతుస్రావం
పీరియడ్స్ బ్లడ్ ఎక్కువగా వస్తున్నా, తీవ్రమైన నొప్పి కలుగుతున్నా అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ కు సంకేతం అయ్యుండొచ్చు కాబట్టి ఈ సమస్యలు వస్తుంటే డాక్టర్‌ను కలవడం మంచిది.