మేకప్ వేసుకుని వర్కౌట్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి?

frame మేకప్ వేసుకుని వర్కౌట్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి?

praveen
ఈ మధ్యకాలంలో మనిషి జీవన శైలిలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. తమను తాము అందంగా చూపించుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళా మణులు అయితే ఇక మేకప్ పైన అతిగా ఆధారపడుతూ ఉన్నారూ. దేవుడు ఇచ్చిన అందం సరిపోదు అన్నట్లుగా ఇక అతిగా మేకప్ వేసుకొని.. తమ అందానికి మరింత మెరుగులు దిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఏకంగా మేకప్ కోసమే ప్రతినెల వేలల్లో ఖర్చు పెడుతూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు ఫంక్షన్లకు పెళ్లిళ్లకు ఇలా మేకప్ లు వేసుకొని అందంగా కనిపించడం వరకు ఓకే.. కానీ ప్రతిరోజు మేకప్ వేసుకుంటే మాత్రం చివరికి చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

 అయితే ఈ మధ్యకాలంలో మేకప్ కి బాగా అలవాటు పడిన మహిళలు ఏకంగా నిద్రలో కూడా మేకప్ వేసుకొని పడుకోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకొంతమంది వర్కౌట్ చేయడానికి జిమ్ కు వెళ్తే ఇక అక్కడ అందంగా కనిపించడానికి మేకప్ వేసుకొని వెళ్తున్నారు. ఇలా మేకప్ తోనే వర్కౌట్స్ చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొన్ని సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది అని సూచిస్తూ ఉన్నారు ఎంతో మంది నిపుణులు.

 మేకప్ వేసుకుని స్పోర్ట్స్ ఆడటం వర్కౌట్ చేయడం చర్మానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మేకప్ పార్టికల్స్ తో శరీరం నుంచి వచ్చే చెమట వేడి కలిసి పోయి మలినాలను  బంధిస్తాయని.. దీనివల్ల చర్మంపై మొటిమలు రంధ్రాలు ఏర్పడతాయని చెబుతున్నారు నిపుణులు. ఇక ఇలాంటి కారణంగా స్కిన్ ఎలర్జీ రావచ్చు అంటూ పేర్కొంటున్నారు. వర్కౌట్ అయ్యాక చమట మలినాలను తొలగించడానికి సున్నితమైన, ఆయిల్ ఫ్రీ క్లెన్సర్ తో శుద్ధి చేయాలి అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: