క్యాట్ ఫిష్ తింటే ఇంత డేంజరా.. అందరూ తప్పక తెలుసుకోండి?
ఇలా అస్సలు తినకూడని చేపలలో క్యాట్ ఫిష్ కూడా ఒకటి అని చెప్పాలి. చాలామంది క్యాట్ ఫిష్ గురించి తెలియక ఇక వాటిని తినేయటం చేస్తూ ఉంటారు. కానీ ఇలా తినడం చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. వాస్తవానికి క్యాట్ ఫిష్ చూసేందుకు కొర్రమీను చేపను పోలి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ చేపకు మీసాలు కూడా ఉంటాయి. అయితే ఈ మీసాలను తీసేసి కొరమీను పేరుతో ఎక్కువ ధరకు ఎంతోమంది అమ్మకం దారులు విక్రయిస్తూ ఉంటారు. అయితే కొంతమంది అమాయకపు ప్రజలు ఈ క్యాట్ ఫిష్ ను గుర్తుపట్టలేక కొర్రమీను ధరకే కొనుగోలు చేయడం చూస్తూ ఉంటాం.
ఇలా కొనుగోలు చేసి ఎక్కువ ధర పెట్టి మరి ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే క్యాట్ ఫిష్ మిగతా చేపలలా కాకుండా కేవలం కుళ్ళిన మాంసాన్ని మాత్రమే తిని పెరుగుతూ ఉంటుందట. అందుకే ఇది కేవలం 6 నెలల్లోని 20 కేజీల వరకు బలుపు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే క్యాట్ ఫిష్ లోను కొర్ర మీను లాగానే ఒకే ముళ్ళు ఉంటుంది. అయినప్పటికీ ఈ చేపలను తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఈ చేపల్లో ఉండే ఒమేగా సిక్స్ ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బ తింటుందట. అంతేకాదు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట. మరీ ముఖ్యంగా క్యాట్ ఫిష్ దవడ కింద ఉండే ముళ్ళు తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని సూచిస్తున్నారు నిపుణులు. కుళ్లిపోయిన వ్యర్ధాలను తిని పెరిగే ఈ చేపలను తింటే శరీరంలో కొత్త కొత్త రోగాలు పుట్టుకు వస్తాయని.. అందుకేఈ చేపలు తినడానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ సూచిస్తున్నారు.