గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే పుట్టే బిడ్డలకు చాలా ప్రమాదం?
అలాగే సీ ఫుడ్ తీనే సమయంలో దానిని మంచిగా వండారా లేదా అనేది కచ్చితంగా పరీక్షించండి. లేదంటే ప్రమాదకరమైన బాక్టీరియా అనేది దరిచేరుతుంది. ఇంకా ఫుడ్ స్టోర్లు లేదా బఫేల నుంచి ముందుగా ప్యాక్ చేసిన సలాడ్లు, ఆహార పదార్థాలను నివారించండి. అవి ఎప్పటి నుంచో ఆరుబయట ప్రదర్శించి ప్రమాదకర సూక్ష్మజీవులను నింపుకుని ఉంటాయి.ఇక బయట భోజనం చేయాల్సిన సమయంలో కేవలం పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లండి. ఇక వీటిని గుర్తించడానికి ఆన్లైన్ రివ్యూలను కచ్చితంగా చదివి తెలుసుకోండి. అలాగే తాజాగా వండిన వేడివేడిగా వడ్డించే వంటకాలను మాత్రమే ఆర్డర్ చేయండి. ఇంకా సురక్షితమైన సీలింగ్ లేదా వేడి చేసిన నీళ్లను మాత్రమే బాటిల్స్‌లో వినియోగించండి. కాబట్టి కచ్చితంగా గర్భిణీ మహిళలు తినే ఆహారంలో ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే గర్భిణీ స్త్రీలు ఇంకా తమకు పుట్టబోయే పిల్లలు ఎంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.