వామ్మో.. ఇయర్ ఫోన్స్ వల్ల.. 100 కోట్ల మందికి చెవుడు?

praveen
ఈ మధ్యకాలంలో ప్రతి రంగంలో కూడా టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక పెరిగిపోయిన టెక్నాలజీ మనిషి జీవన శైలిలో ఎన్నో రకాల మార్పులను తీసుకువస్తుంది. అయితే ఇలా వచ్చే కొన్ని మార్పులు మంచిదే అయినప్పటికీ ఇంకొన్ని మార్పులు మాత్రం ఎన్నో అనర్థాలకు కారణం అవుతున్నాయి. అనడంలో సందేహం లేదు. ఈ మధ్యకాలంలో మొబైల్ వాడే వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఏకంగా మనిషిని బానిసగా మార్చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ప్రతిరోజు గంటల తరబడి మొబైల్లో కనిపిస్తూ ఉన్నాడు. అంతే కాదు మొబైల్ వాడుతున్న చాలామంది వినియోగదారులు నేటి రోజుల్లో హెడ్ ఫోన్స్ వాడటం చూస్తూ ఉన్నాం. అంతేకాదు నేటి రోజుల్లో జనాలు అందరూ కూడా ఇలా ఇయర్ ఫోన్స్ వాడటం, లేదంటే స్పీకర్లు పెట్టుకోవడం, భారీ శబ్దాలు వినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇవి వినికిడి శక్తిని కోల్పోయేలా చేస్తాయి అన్న విషయం తెలిసినప్పటికీ ఎవరు కూడా తమ అలవాట్లు మార్చుకోవడం లేదు.

 కాగా నేటి ఆధునిక సమాజంలో జనాలకు బాగా అలవాటైన ఇయర్ ఫోన్స్, స్పీకర్లు, భారీ శబ్దాలు కారణంగా రానున్న రోజుల్లో కోట్లాదిమంది వినికిడి శక్తిని కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక నివేదికను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం 12 నుంచి 35 ఏళ్ల మధ్య వహిస్తున్న వారిలో 100 కోట్ల మందికి 2050 నాటికి వినికిడి లోపాలు తలెత్తుతాయని.. ఇక ఈ నివేదికలో స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారీ శబ్దాల కారణంగా శాశ్వతంగా వినికిడి కోల్పోతే దానికి పూర్తిస్థాయి చికిత్స లేదు అంటూ వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: