బొరుగులు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
బొరుగులలో చాలా న్యూట్రియన్స్ లభిస్తాయి ఇందులో ఉండే ఫైబర్ జింక్ ఐరన్ విటమిన్-A,C వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఎవరైనా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని తినడం వల్ల ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. బొరుగులు తినడానికి చాలా తేలికగా ఉండటం వల్ల ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ మనకి ఆకలి వేయకుండా చేస్తుందట.
మన శరీరంలో బోన్లెస్ గ్రోత్ పెరగడానికి శరీరం డెవలప్మెంట్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా తినడం వల్ల చాలా మంచిది. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం కూడా చాలా సహజంగా మెరిసేలా చేస్తోందట. అయితే వీటిని అతిగా తిన్నా కూడా గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి.అందుకే కొంత మేరకు మాత్రమే వీటిని తినడం మంచిది. అయితే రోడ్డు మీద దొరికేటువంటి మసాలాతో కలుపుకొని తినడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.