మందులో సోడా, కూల్ డ్రింక్స్ పోసుకొని తాగేస్తున్నారా.. అదెంత ప్రమాదకరమో తెలిస్తే..?

frame మందులో సోడా, కూల్ డ్రింక్స్ పోసుకొని తాగేస్తున్నారా.. అదెంత ప్రమాదకరమో తెలిస్తే..?

praveen
మనం పార్టీలు చేసుకున్నప్పుడు, ఆల్కహాల్ తాగడం చాలా సర్వసాధారణం. చాలామంది ఆల్కహాల్‌లో సోడా, కూల్ డ్రింక్స్ కలిపి తాగుతారు. ఇలా చేస్తే రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి హాని తక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఇది చాలా హానికరం అని నిపుణులు చెబుతున్నారు. సోడా, కూల్ డ్రింక్స్‌లో కెఫిన్, చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆల్కహాల్‌తో కలిసినప్పుడు, చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.
మనం తాగే కోక్, ఫాంటా లాంటివి మనకు ఎక్కువ శక్తిని ఇస్తాయి అని అనుకుంటాం కదా, అందులో ఉండే కెఫిన్ వల్లనే అలా అనిపిస్తుంది. కానీ ఆల్కహాల్‌తో కలిపి తాగితే మనకు చాలా హాని కలుగుతుంది. ఈ రెండింటిని కలిపి తాగితే మనకు మరింత తాగాలనే కోరిక పెరుగుతుంది. అంతేకాదు, కళ్లకు కూడా చికాకు కలిగిస్తుంది. కెఫిన్ రక్తపోటులో మార్పు తీసుకొస్తుంది. దీనివల్ల గుండెకు హాని కలుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ సరిగా జరగదు. అందుకే, గుండె సమస్యలు ఉన్నవారు ఈ రెండింటిని కలిపి తాగడం ఎట్టి పరిస్థితుల్లోనూ మానివేయాలి. కూల్ డ్రింక్స్ లోని షుగర్ డయాబెటిస్, ఒబేసిటీ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.
ఇక సోడాను ఆల్కహాల్‌తో కలిపి తాగడం చాలా ప్రమాదకరం. ఇది ఎందుకంటే సోడా చాలా తీపిగా ఉంటుంది. అందుకే, సోడాను ఆల్కహాల్‌తో కలిపి తాగితే, ఆల్కహాల్ ఎంత తాగుతున్నామో మనకు తెలియదు. ఫలితంగా మనం ఎక్కువ ఆల్కహాల్ తాగి, ఆల్కహాల్ పాయిజనింగ్ ఇంకా అయ్యే ప్రమాదం ఉంది. సోడాలో ఉండే బుడగలు ఆల్కహాల్ మన శరీరంలో వేగంగా చేరడానికి దోహదపడుతాయి. దీంతో మనం త్వరగా మత్తులోకి వెళ్లిపోతాము.
సోడాలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అల్కహాల్‌తో కలిపి తాగితే మన శరీరంలో కేలరీలు ఎక్కువగా చేరుతాయి. దీంతో బరువు పెరుగుతామే కాకుండా, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎక్కువ ఆల్కహాల్ తాగడం, ముఖ్యంగా సోడాతో కలిపి తాగడం వల్ల మన కాలేయం దెబ్బతింటుంది. అంతేకాకుండా, రక్తపోటు పెరిగి, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: