బీరు తాగితే కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయా.. ఇది తప్పక తెలుసుకోండి?

frame బీరు తాగితే కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయా.. ఇది తప్పక తెలుసుకోండి?

praveen
ఈ మధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. మారిపోయిన ఆహారపు అలవాట్లు.. మారుతున్న జీవనశైలి ఈ సమస్యకు కారణం అవుతుంది అని నిపుణులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అందుకే పౌష్టికాహారాన్ని తీసుకుంటూ.. ప్రతిరోజు వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం అని చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఇక జనాలు ఎవరికి అంత సమయం లేదు. దీంతో ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య మాత్రం తీవ్రంగా వేధిస్తుంది.

 అయితే కొంత మందికి ఈ సమస్య కేవలం మందులతో తగ్గిపోతూ ఉంటే.. ఇంకొంతమందికి మాత్రం సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కిడ్నీలో రాళ్ల విషయంలో ఇప్పటికీ కూడా ఎంతోమందిలో ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. మరి ముఖ్యంగా కొంతమంది మందుబాబులు బీరు తాగితే అటు కిడ్నీలో రాళ్లు పడిపోతాయి అని నమ్ముతూ ఉంటారు. ఈ క్రమం లోనే ఇలాంటి అపోహతో ఎంతో మంది కాస్త అతిగా మద్యం సేవించడం లాంటిది కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇలా బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు పడిపోతాయని చాలా మంది నమ్ముతూ ఉండగా.. నిపుణులు మాత్రం ఇలాంటి నమ్మకం ఉన్నవారిని హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీరు లేదా ఆల్కహాల్ తాగడం మంచిది కాదు అంటూ మాక్స్ హెల్త్ కేర్ చెబుతోంది. ఎక్కువ కాలం బీరు తాగితే డీహైడ్రేషన్ వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో ఉండే ఆక్సలైట్ లు, ఫ్యూరీన్లు మూత్ర పిండాల్లో రాళ్ళని అభివృద్ధి చేస్తాయని చెప్పుకొచ్చింది. బీరు శరీరం లో ఉన్న నీటి శాతాన్ని తగ్గిస్తుంది అంటూ తెలిపింది మాక్స్ హెల్త్ కేర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: