శరీరంలో లవ్ హార్మోన్ పెరగాలంటే ఇలా చేయండి ?

frame శరీరంలో లవ్ హార్మోన్ పెరగాలంటే ఇలా చేయండి ?

Veldandi Saikiran
ప్రేమ చాలా గొప్పది. ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కొంతమందికి కొందరిపై అపారమైన ప్రేమ ఉంటుంది. వారిని విపరీతంగా ప్రేమిస్తారు. అయినప్పటికీ వారు ప్రేమించిన వ్యక్తి తిరిగి ప్రేమించరు. అలాంటి వారిలో కొన్ని రకాల లోపాలు ఉంటాయని.... అలాంటివారు తిరిగి ప్రేమించాలంటే వారిలో లవ్ హార్మోన్స్ పెంచాలి. లవ్ హార్మోన్ పెరగాలంటే వారితో సాన్నిహిత్యాన్ని, బంధాన్ని పెంచుకోవాలి.

మనకు నచ్చిన వారి చేతులు పట్టుకోవడం, హగ్ చేసుకోవడం వంటివి చేయాలి. అలా చేయడం వల్ల ఫిజికల్ టచ్ తో ఆక్సిటోసిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా ఫిజికల్ కనెక్షన్ వల్ల మెదడుకు ప్రేమ సంకేతాలు పంపుతుంది. తద్వారా ఆక్సిటోసిన్ పెరుగుతుంది. ఇష్టమైన వారితో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి. మన ఫీలింగ్స్ వారితో షేర్ చేసుకోవడం, మాట్లాడడం వంటివి చేయడం వల్ల హార్మోన్ రిలీజ్ అవుతుంది.

ఇతరులకు సహాయం చేసే సమయంలో మెదడు నుంచి ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఎక్కువగా సంతోషంగా ఉన్న సమయంలో ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. చాలామంది పెంపుడు జంతువులతో సమయాన్ని గడపడం ద్వారా సంతోషంగా ఉంటారు. అలా చేయడం వల్ల ప్రేమ పెరిగి హార్మోన్ రిలీజ్ అవుతుంది. శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ రిలీఫ్ అవుతుంది.
తద్వారా శరీరంలో హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎక్కువగా నవ్వడం, సంతోషంగా ఉండడం వల్ల హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుతూ, సంతోషంగా సమయాన్ని గడపడం, సినిమాలకు వెళ్లడం, షాపింగ్స్ కి వెళ్లడం వల్ల మైండ్ రిలాక్స్ అయ్యి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకు ఇష్టమైన వారికి దగ్గర అవ్వచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: