షుగర్ పేషంట్స్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇంత ప్రమాదమా?

frame షుగర్ పేషంట్స్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇంత ప్రమాదమా?

praveen
ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మార్పులు ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో మారిపోతున్న మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి.. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా తెచ్చిపెడుతున్నాయి అని చెప్పాలి. ఇలా ఈ మధ్యకాలంలో చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఏదైనా ఉంది అంటే అది డయాబెటిస్ సమస్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ సమస్య వేధిస్తుంది. దీంతో డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న ఎంతోమంది చివరికి హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాదు ఇష్టమైనవి తినలేక కడుపు కట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక నడక విషయంలో కూడా తప్పనిసరిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 సాధారణంగా ఇలా డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఏదైనా గాయాలు అయితే అవి త్వరగా మానవు. ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇలా గాయాలతో బాధపడుతున్న వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పులు లేకుండా నడవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే డయాబెటిక్ తో పాదాల ఇన్ఫెక్షన్, గ్యాంగ్ గ్రీన్ వంటివి జరుగుతాయట. ఇక షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల గాయాలు మానవు. గాయం నొప్పి తెలియదు. దీనివల్ల మరింత నష్టం జరుగుతుందట. కాలు ధమనులలో అడ్డంకులు ఏర్పడి గాయం నయం కాదు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే నడిచేటప్పుడు తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలని.. చెప్పులకు బదులు షూస్ వేసుకుంటే మరింత మంచిది అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: