కుక్కలు పెంచుకునే అలవాటు ఉందా.. ఈ జాతి కుక్కలతో తస్మాత్ జాగ్రత్త?

frame కుక్కలు పెంచుకునే అలవాటు ఉందా.. ఈ జాతి కుక్కలతో తస్మాత్ జాగ్రత్త?

praveen
ఈ మధ్య కాలంలో కుక్కలను పెంచుకోవడం అనేది ఎంతో మందికి అలవాటుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది ఇలా పెట్ డాగ్స్ ని పెంచుకోవడాన్ని ఏకంగా ట్రెండ్ గా కూడా ఫీల్ అవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎంతో ఇష్టంతో తమకు ఇష్టమైన బ్రీడ్ కుక్కలను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఏకంగా మనుషుల మీద చూపించిన దాని కంటే ఎక్కువగా కుక్కల మీద ప్రేమను చూపిస్తూ ఉండడం కనిపిస్తూ ఉంది. ఇక ఇలా ఏకంగా కుక్కలను యజమానులైన ఒక పూట ఉపవాసం ఉంటారేమో కానీ కుక్కలకు మాత్రం కాస్లీ ఫుడ్ పెడుతున్నారు చాలామంది.

 ఇంకొంతమంది కుక్కలను పెంచుకోవడం ఇష్టం లేక పోయినప్పటికీ.. ట్రెండ్ ఫాలో అవ్వాలి కాబట్టి.. ఇక ఏదో కుక్కను తెచ్చుకుని ఇంట్లో పెంచుకోవడం దానిని రోజు వాకింగ్కు తీసుకువెళ్లి తాము కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నాము అని ఎదుటి వ్యక్తులకు చూపించడం లాంటివి చేస్తున్నారు. అయితే విశ్వాసానికి మారుపేరైన కుక్కలను పెంచుకోవడం మంచిదే. ఎందుకంటే ఇంటికి కాపలాగా ఉండడమే కాదు.. యజమానులకు ఈ మధ్యకాలంలో కుక్కలు రోజువారి పని చేయడంలో కూడా సహాయం చేస్తూ ఉన్నాయి. కానీ ఇలా కుక్కలను పెంచుకునే అలవాటు ఉన్నవారు కొన్ని రకాల కుక్క జాతులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ఎందుకంటే పెంపుడు కుక్కలకు చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వాటి స్వభావం లో కొన్ని రకాల మార్పులు వస్తాయని.. ఇలాంటి మార్పులు మనకి, పిల్లలకి మంచివి కాదు అంటూ వెటర్నిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అలాంటి బ్రీడ్ కుక్కలను పెంచుకోవద్దు అంటూ సూచిస్తున్నారు.  అందులో ప్రధానంగా రోట్వీలర్, చౌ చౌ,జాక్ రసల్ టెరియర్, చివావా, అకిత, పెకింగిస్, షి త్జూ, బుల్ మాస్తీస్, డాబర్మాన్, గ్రేహౌండ్ లాంటి కుక్క జాతులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: