డ్రైవింగ్ చేసేవారు కచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. లేదంటే వారి జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఎంతైనా ఉంది. ఇకపోతే కొంత మంది చాలా చిన్నదే కదా అని ఒక పొర పాటును పదే పదే చేస్తూ ఉంటారు. దాని వల్ల కూడా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది ఏమిటి అనుకుంటున్నారా ..? డ్రైవింగ్ చేసే సమయంలో కొంత మంది చెప్పులు లేదా షూస్ ధరించకుండా నేరుగా కాళ్లతోనే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దానిని వారు చాలా చిన్న దానిగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకు అంటే చెప్పులు , షోస్ లేనట్లయితే ఏమవుతుంది ..? నేరుగా పాదాలు పెడల్స్ పై చెప్పులు , షోస్ లేకుండా పెట్టి డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుంది అనే వాదనను వినిపిస్తూ ఉంటారు.
ఇక దాని వల్ల కూడా ప్రమాదాలు ఎదురవుతాయి. చెప్పులు షూస్ లేకుండా నేరుగా పెడల్స్ పై పాదాలు పెట్టి డ్రైవ్ చేయడం వల్ల కాలుపై ప్రెషర్ పడే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇలా క్రమంగా జరిగితే ప్రమాదం కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు కొన్ని సందర్భాలలో సడన్గా జరుగుతుంటాయి. అలా సడన్గా ప్రమాదం ఎదురైనప్పుడు మనం చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోకుండా డ్రైవ్ చేసినట్లయితే సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చిన సందర్భంలో పాదాలకి గాయాలు అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది.
ఇక పాదాలు చాలా సున్నితంగా ఉంటాయి. దాని వల్ల ఎక్కువ సేపు డ్రైవ్ చేయడం వల్ల వాటికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అదే చెప్పులు లేదా షూస్ ధరించి కొని ఎంత సమయం డ్రైవ్ చేసినా పెద్దగా నష్టం ఏమీ ఉండదు. ఇకపోతే కొంత మంది కారును చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అనుకుంటారు. అలాంటి వారు చెప్పులు లేదా షూస్ లేకుండా డ్రైవ్ చేసినట్లయితే వారి కాళ్ల ద్వారా కారులోకి చాలా పెద్ద మొత్తంలో డస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కారు కూడా త్వరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా చెప్పులు లేదా షూస్ లేకుండా డ్రైవ్ చేయడం ద్వారా అనేక చిన్న చిన్న నష్టాలు ఉంటాయి.