పసివారికి కూడా గుండె సంబంధిత వ్యాధులు అందుకే వస్తున్నాయి... ఇది బాధ్యతతో మేలుకోవాల్సిన సమయం!

Suma Kallamadi
నేడు మనిషి దారుణమైన పరిస్థితులలో పెరుగుతున్నాడు. కాలం మారుతున్న కొలది, మనిషి ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. నేటి యాంత్రిక యుగంలో తల్లిదండ్రులకి పసిపిల్లలను కూడా పట్టించుకునే సమయం ఉండడం లేదు. ఉదయాన్నే లేచి, ఆదరాబాదరా రెడీ అయ్యి, ఏదో సమయానికి చేయాలి కదా అని ఫుడ్ ప్రిపేర్ చేసి స్కూలుకు వెళుతున్న పిల్లల లంచ్ బాక్స్ లలో తినకూడని ఫుడ్డు నింపేస్తున్నారు. దాన్నే ప్రధాన కారణంగా ఆరోగ్య నిపుణులు వేలెత్తి మరీ చూపిస్తున్నారు.
మరి ముఖ్యంగా, నేటి తరం ఎక్కువగా జంక్ ఫుడ్స్ అయినటువంటి... పానీ పూరి, నూడిల్స్, మంచూరియా, బేకరీ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జా మొదలైన ఆహారాలను ఇష్టపడుతూ లాగించేస్తున్నారు. ఇటువంటి ఆహారపు అలవాట్లే నేటి తరం చిన్నారుల పైన ఎక్కువ ప్రభావం చూపి, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయని కార్డియాలజిస్టులు ముఖ్యంగా పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చిన్న పిల్లల తల్లిదండ్రులకు అనేక రకాల సూచనలు చేస్తున్నారు.
మరి ముఖ్యంగా చిన్నపిల్లలు తినే ఆహారంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ అసలు ప్రిఫర్ చేయకూడదని అంటున్నారు. ఎంత బిజీ లైఫ్ లో అయినా చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచిస్తున్నారు. వీలైనంతవరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలని, ఇంటిదగ్గర తయారైన ఆహారం మాత్రమే పెట్టాలని చెబుతున్నారు. ప్రతి ఏటా దేశంలో సగటున 3000 మందికి పైగా చిన్నారులు గుండె వ్యాధి సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఎక్కువగా సంభవిస్తున్నాయని కూడా సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి పిల్లలకు కేటాయించిన ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా బాధ్యతతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా, వారిని ఫోన్లలో ఆటలు ఆడకుండా బయట మైదానాల్లో ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించాలని సూచనలు చేస్తున్నారు. వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉంచడం మంచిదని కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: