హెల్త్: నాలుకపై వచ్చే పొక్కులు..దానికే నిదర్శనమా..?

FARMANULLA SHAIK
సాధారణంగా జబ్బు చేసి డాక్టర్ దగ్గరకు వెళితే నాలుక చాపమని.. అటు ఇటూ చూస్తారు. అంతే వెంటనే మనకు ఏమైందో చెప్పేస్తాడు. అయితే నాలుక చూస్తే ఏం తెలుస్తుంది అనుకుంటారు చాలా మంది. అదే మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేసే చిట్కా. నాలుకను బట్టి మనిషి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడమనేది డాక్టర్లకు చాలా సులువు. అయితే ఇప్పుడు నాలుకను చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాలుక రంగులను బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఉదహారణకు మీ నాలుక గులాబీ రంగులో కనిపిస్తే అది తేమగా.. మృదువుగా ఉన్నట్లు అర్థం. అలాగే.. కాస్తా తేడాగా ఉన్నా.. ఒత్తిడి లేదా నొప్పి ఉంటే కోన్ని ఆరోగ్య సమస్యలను చూపిస్తుంది.నాలుకపై పదేపదే పొక్కులు రావడం అనేది సాధారణ సమస్య కావచ్చు, కానీ ఈ సమస్య కొనసాగితే, దానిని నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం కావచ్చు. నాలుకపై పుండ్లు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. మసాలా లేదా జిడ్డుగల ఆహారం తీసుకోవడం, విటమిన్లు మరియు ఖనిజాలు లేకపోవడం, ముఖ్యంగా విటమిన్ B12, ఫోలిక్ ఆమ్లం మరియు ఇనుము వంటివి ఆహారంలో లేకపోవడం. అంతే కాకుండా కడుపులో ఎసిడిటీ పెరగడం, ఒత్తిడి, నోటి పరిశుభ్రత లోపించడం వంటివి కూడా అల్సర్లకు కారణం కావచ్చు. అయితే, అల్సర్‌లు పదేపదే వస్తుంటే, అది తీవ్రమైన సమస్యకు సంకేతం. ఇది కడుపు పూతల, కాలేయ సమస్యలు లేదా ఏదైనా రకమైన ప్రేగు వ్యాధి వంటి అంతర్గత వ్యాధుల లక్షణం కూడా అవుతుంది.

ఇది రోగనిరోధక వ్యవస్థ రుగ్మత మరియు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా సంకేతం కావచ్చు. అల్సర్‌లను నిర్లక్ష్యం చేస్తే, ఈ పరిస్థితి మీకు ప్రాణాంతకంగా మారవచ్చు. అల్సర్లు ఎక్కువ కాలం కొనసాగితే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అయితే వాటిని నివారించేందుకు మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు మరియు పోషకమైన ఆహారాన్ని చేర్చండి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజంతా తగినంత నీరు త్రాగాలి. ఇదిలావుండగా నాలుక మీద పొక్కులు,పూత వచ్చాయంటే తినాలన్న తాగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటి పొక్కులను,పూతను తగ్గించుకోవటానికి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే చాలా మంచి ఫలితం ఉంటుంది.వంటింటిలో రెగ్యులర్ గా వాడే పసుపు ఈ నోటి పొక్కులను,పూతను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. పసుపులో నీటిని కలిపి పొక్కులు,పూత ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.పసుపు మార్కెట్ లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములతో ఆడించిన పసుపు వాడితే మంచిది. ప్యాకెట్ పసుపు లో కెమికల్స్ కలిసే అవకాశం ఉంది.నోటి పొక్కులు,పూత వచ్చినప్పుడు ఈ రెమిడీ ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: