టైట్ దుస్తులు ధరిస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

Divya
ఫ్యాషన్ అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.. మార్కెట్లోకి అప్పుడప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు జీవనశైలిలో ఎక్కువగా అబ్బాయిలు బూట్ కట్ జీన్స్ ధరించేవారు ఆ తర్వాత టైట్ జీన్స్, షార్ట్ జీన్స్ అనేటివి వచ్చాయి. అలాగే అమ్మాయిలు ఒకప్పుడు చాలా పద్ధతిగా నిండుగా లంగా ఓణీలు, గాగ్రాలు, పంజాబీ డ్రెస్సులు వంటివి ధరిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రాను రాను మోడ్రన్ దుస్తుల వైపే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. టైట్ స్కిన్ దుస్తులు, టైట్ జీన్స్, లెగ్గింగ్స్, షార్టులు ,స్కర్ట్లు అని నానా దుస్తులను వేసుకుంటూ ఉన్నారు.

అయితే ఇలాంటి దుస్తుల వల్ల శరీరాకృతి స్పష్టంగా ప్రదర్శించుకున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట. ముఖ్యంగా టైట్ దుస్తులు చర్మం పైన చాలా ఒత్తిడిని తీసుకువస్తాయని ఇవి రక్తప్రసరణ పైన చాలా ప్రభావితాన్ని చేస్తాయట. నరాల దెబ్బ తినడానికి కూడా ఆస్కారం ఉంటుందని దీనివల్ల పిల్లలు పుట్టడం పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని కలిగించేలా చేస్తాయట.
బిగువైన దుస్తులు ధరించడం వల్ల చర్మం పైన ఎక్కువగా దద్దుర్లు వచ్చి దురద చికాకు వంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా తొడలు , ప్రైవేట్ పార్ట్ల వద్ద చాలా  సమస్యలు ఎదురవుతాయట.

బిగువైన దుస్తులు ధరించడం వల్ల గాలి దూరదు దీనివల్ల చాలా భాగాలలో ఫంగస్ పెరుగుదలకు కారణమవుతుందట. దీనివల్ల దురద లేదా అథ్లెట్స్ వంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయట.

బిగువైన దుస్తులు చర్మానికి అతుక్కొని ఉంచడం వల్ల ఇవి చెమట నూనెలను సైతం ఎక్కువగా బంధిస్తాయి ఇవి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయట. దీని ఫలితంగానే చర్మం పైన చాలా మొటిమలు ఏర్పడడానికి కారణం అవుతాయట.
టైట్ బెల్ట్ ప్యాంటులు, స్కర్ట్ లు  ధరించడం వల్ల చర్మం సున్నితత్వాన్ని సైతం కోల్పోతుందట. దీనివల్ల రక్తప్రసరణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. అందుకే సౌకర్యవంతమైన దుస్తులను ధరించడమే ముఖ్యము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: