ఇంట్లో ఎలుకలు చేరుతున్నాయా.. ఈ టిప్స్ పాటించండి..!

Divya
చాలామంది గ్రామాలలో పూరి గుడిసెలు ఉండేవి.. ముఖ్యంగా ధాన్యం తినడానికి ఎలుకలు కూడా చాలానే వస్తూ ఉండేవి. అయితే ఈమధ్య పల్లెలలో కూడా అభివృద్ధి చెందడం , ఇల్లు కట్టుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లల్లో ఎలుకలు ప్రవేశించి ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటిని ఎక్కువ రోజులు శుభ్రం చేసుకోకపోయినా , మురికి కాలువలు ఉన్న, చెత్తాచెదారం ఉన్న ఎలుకలు చేరే అవకాశం ఉంటుంది. ఎలుకలు చేరాయి అంటే వస్తువులు బట్టలను కొరికేయడమే కాకుండా ఆహారానికి సంబంధించిన వాటిని కూడా హానికరం కలిగించేలా చేస్తాయి. మరి ఎలుకలను తరిమికొట్టడానికి ఉపయోగపడే చిట్కాలు గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఏదైనా పిండిని కొంతమేరకు తీసుకొని అందులోకి కాస్త బెల్లం లేదా చక్కెర వంటిని కలపాలి. వీటితోపాటు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా కలిపి అందులోకి కాస్త బేకింగ్ సోడా వేసి నీళ్లతో బాగా కలపాలి.. అలాగే మొబైల్ బ్యాటరీ ని పగలగొట్టి అందులో ఉండే నల్లటి పొడిని కాగితం మీద ఉంచుకొని తయారు చేసినటువంటి ఒక పిండిని రౌండ్ గా చేసి అందులో నల్లటి పొడిని వేసి ఒక మాత్రల ఉపయోగించాలి. ఈ మాత్రలను ఎలుకలు రంధ్రాలు చేసే చోట లేకపోతే ముఖద్వారం వద్ద ఉంచితే ఎలుకలు వీటిని తింటాయి ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాయట. అయితే దీనిని చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలట.

పుదినా ఆయిల్ ద్వారా కూడా ఎలుకలని బయటికి తరిమేయవచ్చు దీని నుంచి వచ్చే ఘాటు వాసన వాటికి నచ్చదు.. కాస్త దూదిని తీసుకొని ఈ ఆయిల్ లో ముంచి వంటింట్లో ఉంచడం వల్ల ఎలుకలు లోపలికి రావు.

అలాగే ఎలుకలు వెళ్లి పాయలను అసలు తినవు అందుకే వాటి నుంచి వచ్చే వాసన ద్వారా కూడా అవి దూరంగా పోతాయి.. వీటిని బాగా దంచి నీటిలోకి కలిపి ఆ నీటిని స్ప్రే బాటిల్ లో ఉంచి ఇంటి లోపల స్ప్రే చేస్తూ ఉండడం వల్ల ఎలుకలు పురుగులు కీటకాలు వంటివి లోపలికి రావట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: