ఉప్పు ఎక్కువ తింటున్నారా.. ఆ క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. సంచలన అధ్యాయనం..?

Pulgam Srinivas
మనం రోజు తీసుకునే ఆహారం లో ఉప్పు అనేది కీలకం గా ఉంటుంది . ఉప్పు లేని ఆహారం తినడం ఎంతో కష్టం గా ఉంటుం ది . వండేటప్పు డు ఉప్పు కాస్త తక్కువ అయి నా ఆ తర్వాత మళ్లీ వంటల్లో రుచి తక్కువ అయింది అని మళ్లీ ఉప్పు ని వేసుకునే వారు అనేక మంది ఉంటారు . ఇక పోతే కొంత మంది ఉప్పు ను చాలా తక్కువ గా తీసుకుంటూ ఉంటారు.

కానీ మరి కొంత మంది మాత్రం ఉప్పు ను చాలా ఎక్కువ మోతాదులో రోజు వారి ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఉప్పును ఎక్కువ తీసుకునే వారిలో బ్లడ్ ప్రెజర్ అధికం అవుతుంది అని , ఉప్పును ఎక్కువ తీసుకునే వారికి అధికంగా బ్లడ్ ప్రెజర్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అని కొన్ని అధ్యయనాలు చెప్పిన విషయం మనకు తెలిసిందే. అలాగే జనాలు కూడా బ్లడ్ ప్రెజర్ సమస్యలు వస్తాయి అని ఉప్పును తక్కువ తీసుకునేవారు కూడా ఉన్నారు. 

ఇక తాజాగా ఓ అధ్యయనం ప్రకారం ఉప్పును రోజు వారి ఆహారంలో ఎక్కువ తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా యునైటెడ్ కింగ్డమ్ లో పరిశోధనలు చేపట్టారు. అందులో భాగంగా లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించగా అందులో ఉప్పు ఎక్కువగా తినేవారు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఆ అధ్యాయం ద్వారా గుర్తించారు. దాని ద్వారా రుచి కోసం రోజు వారి ఆహారంలో ఇప్పుడు ఎక్కువ ఉప్పు తీసుకునే వారికి బ్లడ్ ప్రెజర్ ప్రాబ్లం తో పాటు ఎంతో కఠినమైన క్యాన్సర్ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు యూకే వారు ఓ అధ్యయనాన్ని విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: