పైనాపిల్ అతిగా తింటున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..?

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రకరకాల పండ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ప్రయత్నిస్తూ ఉంటారు.అలాంటి వాటిలో పైనాపిల్ కూడా ఒకటి.. అయితే ఇది తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని వైద్యులు కూడా తెలియజేస్తూ ఉంటారు.. అయితే ఇది కొన్నిసార్లు ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలను కూడా తెచ్చి పెట్టేలా చేస్తుందట .ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు ఈ పండులో ఉన్న తీపి పులుపు తినడానికి చాలామంది మక్కువ చూపుతారు. అతిగా తినడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం.

పైనాపిల్ లో విటమిన్ -C చాలా పుష్కలంగా లభిస్తుంది పైనాపిల్ లో ఉన్న బ్రోమోలైన్ ఎంజైయ్  కూడా చాలా శరీరానికి ఉపయోగపడుతుంది . పైనాపిల్ మధుమేహ వ్యాధి గ్రహస్తులు తింటే కచ్చితంగా వారికి షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. వీటిని తినడం వల్ల కూడా సడన్గా ఆరోగ్యమనేది అనారోగ్య బారిన పడుతుందట. అందుకే షుగర్ వ్యాధి గ్రహస్తులు వీటికి దూరంగా ఉంటారు. అయితే కొంతమంది పైనాపిల్ ఎక్కువగా తింటూ ఉంటారు.. అలాంటి వారికి పైనాపిల్ను తినడం వల్ల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం.

పైనాపిల్ తినడం వల్ల  ఉన్న వారిలో కడుపులో అల్సర్ మరియు అసిడిటీ సమస్య వస్తుందట. ఈ పండు తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుందట. రాత్రిళ్ళు సమయంలో ఎవరు కూడా ఈ పైనాపిల్ పండుని తినకూడదట.అలాగే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్-c అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది శరీరానికి అంతగా మంచిది కాదట. అందుకే కిడ్నీలు పాడవకుండా ఉండాలి అంటే వీటిని తగిన మోతాదులలోనే తినడం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా వీటికి దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: