పల్లెలలో దొరికే ఈ మొక్క.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

frame పల్లెలలో దొరికే ఈ మొక్క.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Divya
ప్రకృతిలో మనకు సహజంగానే ఎన్నో మొక్కలు లభిస్తూ ఉంటాయి. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నవి. వీటి గురించి చాలామందికి తెలియక వదిలేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడైనా సరే దొరికేటువంటి మొక్కలలో గడ్డి చామంతి మొక్క కూడా ఒకటి.. ఇది పొలాల గట్లపైన కాలువల మధ్య ఎక్కడైనా సరే ఇది దొరుకుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో పేరు మారుతూ ఉంటుంది తప్ప గడ్డి చామంతి అనేది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఈ ఆకులను ఎన్నో ఆయుర్వేద మందులలో కూడా తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారట.
ఈ గడ్డిచామంతి ఆకులలో యాంటీ కార్సనోజినిక్ అనే పదార్థం ఉంటుందట. ఇది డయాబెటిస్ ను సైతం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందట. ఈ ఆకులను సైతం నమిలి తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి.. ముఖ్యంగా జుట్టు సమస్యలు ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి కూడా తగ్గించేలా చేస్తుందట. అలాగే దగ్గు జలుబు గొంతు గరగర  నుండి ఉపశమనం పొందాలి అంటే ఈ ఆకుతో ధూపం వేసుకోవడం మంచిది. అలాగే ఏవైనా గాయాలు తగిలినప్పుడు వెంటనే ఈ ఆకు రసం పిండితే ఆ గాయం నుంచి రక్తం కారడం ఆగిపోతుందట.

ఈ ఆకులను మెత్తగా పేస్ట్ గా నూరి ఆ తర్వాత కాస్త కొబ్బరి నూనెలో కలుపుకొని తలకి రాస్తే ఖచ్చితంగా జుట్టు పెరగడం ఖాయమట. అలాగే చుండ్రు సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే నీటిలోకి కొంత రసాన్ని సైతం వేసుకొని నీటిని స్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. అలాగే శ్వాస సంబంధిత వ్యాధులతో లివర్ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆకు యొక్క కషాయాన్ని తాగడం వల్ల వాటన్నిటికీ చెక్ పెట్టవచ్చు. మొత్తానికి ఎక్కడైనా సరే ఈ ఆకు దొరుకుతుంది. ఏదైనా అలర్జీ ఉన్నవారు మాత్రం వీటికి దూరంగా ఉండటమే ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: