సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. అదే ఈ మొక్క..!
ముఖ్యంగా కుష్టి, మూత్రశయ సమస్యలు, అలాగే కామెర్లు, గాయాలు, అలసర, విరోచనాలు, అలర్జీ ,నీరసం ,తలనొప్పి, కండరాల బలహీనత ఇలా ఇవే కాకుండా ఎన్నో రకాల వ్యాధులను సైతం ఈ అతిబలం మొక్క తగ్గిస్తుంది. కాబట్టి ఈ మొక్కను సకల రోగాల బ్రహ్మాస్త్ర మొక్కగా మన పూర్వీకులు సైతం భావించే వారట.. ఈ మొక్క ఆకులను సైతం నీటిలోకి వేసి మరిగించిన తర్వాత నోటిలో వేసుకొని పుక్కిలించడం వల్ల దంతాల నొప్పి చిగుళ్ల నొప్పి నోటిలో బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందట.
ఈ మొక్క వేర్లు చూర్ణంగా చేసుకొని అందులోకి కాస్త బెల్లాన్ని నంచుకొని కలిపి తింటే అతి దాహం అనేది తగ్గిపోతుందట. అతిబల మొక్క ఆకులను డికాషన్ రూపంలో చేసుకుంటే దగ్గు వంటిది తగ్గుతుందట. అలాగే మూత్రశయ సమస్యలను కూడా తగ్గించడానికి ఈ అతిబల మొక్క ఉపయోగపడుతుంది. ఎవరైనా నీరసంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అతిబల మొక్క యొక్క ఆకులతో మరిగించిన నీటిని తాగడం వల్ల వెంటనే శక్తి పెరుగుతుందట. అందుకే ఈ అతిబల మొక్క ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మన పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించే వారట.