ఇవి తింటే యవ్వనంలోనే ముసలితనం.. హెచ్చరిస్తున్న నిపుణులు?

praveen
మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి తన అలవాట్లను కూడా మార్చుకుంటూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా మార్చుకుంటున్న అలవాట్లలో ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఏకంగా ఇంట్లో ఉండిన ఆహారాన్ని తినడానికే మనిషి ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం మసాలాలు దట్టించిన జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సరదాగా స్నేహితులతో కలిసి ఏదో ఒక రెస్టారెంట్ కు వెళ్లడం అక్కడ మసాలాలు దట్టించిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని తినడం చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో అయితే పిజ్జాలు బర్గర్లు అంటూ ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆకర్షణీయమైన ఆహారాలు చాలానే దొరుకుతూ ఉన్నాయి.

 ఇలాంటి కొత్త రకం ఆహారాలకు అటు జనాలు కూడా బాగా ఆకర్షితులవుతున్నారు. అవి తినడం వల్ల అనారోగ్యం పాలవుతాము అన్న విషయంపై అందరికీ ఒక అవగాహన ఉంది. అయినప్పటికీ ఇలాంటివి తినడం మానడం లేదు. దీంతో చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ సంపాదించిన మొత్తాన్ని ఆస్పత్రిలో చికిత్స కోసం ఖర్చు పెట్టుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాదు ఏకంగా యవ్వనంలో కూడా ముసలితనాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉంది అంటూ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.

 ఇలా కొన్ని రకాల ఫుడ్స్ తింటే ముందుగానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర పిండి పదార్థాలతో తయారుచేసే పిజ్జా బర్గర్లు, పఫ్స్, స్వీట్లు తింటే అకాల వృద్ధాప్యం దరిచేరుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా కూడా చర్మంపై ముడతలు  తొందరగా వచ్చి.. యంగ్ ఏజ్ లోనే ముసలి వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. టీ కాఫీ మద్యపానం ఎక్కువ చేసిన కూడా త్వరగా ముసలి వాళ్లు అయిపోతారు అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండి కేవలం హెల్తి ఫుడ్ మాత్రమే తీసుకోవడం వల్ల ఇక ఏజ్ పెరుగుతున్న ఇంకా యంగ్ గా కనిపించేందుకు అవకాశం ఉంటుంది అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: