ఖాళీ కడుపుతో వర్కౌట్ చేస్తున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే?

praveen
ప్రతిరోజు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా దక్కుతుందని చెబుతూ ఉంటారు. అంతేకాదు ఇక ఇలా ఫిట్ గా ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొట్టే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి కూడా ఇలా వ్యాయామం చేసే టైమే లేకుండా పోయింది. ఏకంగా ఉన్న కాస్త సమయాన్ని మొబైల్ చూడటానికో లేకపోతే ఓవర్ టైం పని చేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఇలా వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎవరూ ఆలోచన చేయట్లేదు.

 అయితే కొంతమంది మాత్రమే ఆరోగ్యమే మహాభాగ్యం అని సూత్రాన్ని నమ్ముతూ..  ఫిట్నెస్ పై దృష్టి పెడుతూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇలా ఎంతోమంది ఉదయాన్నే వ్యాయామం చేయడం చేస్తూ ఉంటారు. కానీ వ్యాయామం చేసేవారిలో కూడా ఎలా చేయాలి? ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయంపై ఇక ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఇక ఇలాంటి అనుమానాలను డాక్టర్లను అడిగి ఇక సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడూ ఇలాంటిదే ఒక విషయం వైరల్ గా మారిపోయింది  వ్యాయామం చేయడానికి ముందు ఏమైనా తినాలా లేదంటే ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేయొచ్చా లేదా అనేది అందరిలో ఉండే అనుమానం. ఒకవేళ కాళీ కడుపుతో వర్కౌట్ చేస్తే ఏదైనా చెడు జరుగుతుందా అని అందరూ అనుకుంటూ ఉంటారు.

 అయితే ఈ విషయంపై వైద్య నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కౌట్స్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అంటూ చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే గ్లూకోజెన్ స్థాయిలు తగ్గిపోతాయట. ఇక అంతేకాకుండా శరీరంలో పొగైన కొవ్వుల్ని శరీరం శక్తి కోసం వాడుతుందట. దీంతో కొవ్వు వేగంగా కరిగిపోయేందుకు అవకాశం ఉంటుందట  అంతేకాకుండా బాడీ గ్లూకోస్ ని మరింత వేగంగా పీల్చుకుంటుందట. ఇక దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట.  గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. అంతేకాకుండా ఏకాగ్రత పెరిగి రోజంతా చలాకీగా ఉండేందుకు ఇలాంటి వర్కౌట్ తోడ్పడుతుంది అంటూ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: