ఏడిస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి.. సైంటిఫిక్ రీజన్ ఇదే?

praveen
నేటి రోజులు ఇంటర్నెట్ అనేది ప్రతి మనిషిలో ప్రతి విషయంపై అవగాహన పెంచే ఒక సాధనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇంటర్నెట్ వల్ల ఇక ఎన్నో తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే  ప్రతి విషయంపై అవగాహన పెంచుకొని ఇక ఎంతో జాగ్రత్తగా ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని విషయాలు మాత్రం అందరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో సహజంగా జరిగే కొన్ని విషయాల గురించి మనిషి పెద్దగా పట్టించుకోడు. అందరికీ ఇలాగే జరుగుతుంది నాకు కూడా జరుగుతుంది. దాంట్లో కొత్త ఏముంది అని ఇక అలాంటి విషయాలను పెద్దగా దృష్టిలో పెట్టుకోడు..
 అలాంటి విషయాలలో కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం లాంటిది కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏడుపు వచ్చినప్పుడు.. లేదంటే పట్టలేనంత సంతోషం వచ్చినప్పుడు కూడా కళ్ళల్లో నుంచి నీరు రావడం చూస్తూ ఉంటాం. వీటిని కన్నీళ్లు అంటూ ఉంటారు. మరి ఎక్కువగా అయితే బాధ వచ్చినప్పుడు ఇలాంటి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు ఇలా ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే అందరికీ ఇలాగే వస్తుంది కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచించడం ఎందుకు అని అందరూ ఊరుకుంటారు. అయితే ఇలా ఏడ్చినప్పుడు కళ్ళలోంచి నీళ్లు రావడం వెనక పెద్ద సైంటిఫిక్ రీజనే ఉందట.

 మనుషులు ఆనందంగా ఉన్నప్పుడు లేదంటే బాధగా ఉన్నప్పుడు వచ్చే కన్నీళ్లు వారి మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాయి అంటూ నిపుణులు చెబుతున్నారు. ఆనందం బాధ నిరాశ అసహనం ఇలా ఏది కలిగినా కూడా శరీరంలో హానికరమైన టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయట. ఇక వాటిని బయటకు పంపేందుకు ఏడుపు ఎంతో అవసరం ఉంటుందట. ఒక మనిషి ఏడుస్తున్న సమయంలో ఎండోక్రైన్ ద్వారా ఈ టాక్సిన్స్ కళ్ల చుట్టూ వెళ్తాయట. ఈ టాక్సిన్స్ శ్లేష్మం లేదంటే జిడ్డుగా ఉండే ఉప్పు నీటిని విడుదల చేస్తాయట. ఇవే కన్నీటి రూపంలో బయటికి వస్తాయట. అందుకే అప్పుడప్పుడు ఏడవడం కూడా మంచిదే అని చెబుతూ ఉంటారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: