సైనస్ సమస్య వేధిస్తోందా.. పరిష్కారం ఇదే..?
ముఖ్యంగా సైనస్ అంటే ఏమిటంటే.. ముక్కు చుట్టూ ఉండే గాలితో నిండి ఉన్న క్యావిటీస్ నే సైనస్ అంటారు. ఇది మన శరీరాన్ని, శ్వాస తీసుకోవడంలో ముఖం మీద ఉండే ఎముకలను సైతం బలోపేతం చేయడానికి, అలాగే తలను మనం అటు ఇటు ఊపుతున్నప్పుడు తేలికగా ఉండడానికి సహాయపడుతుందట. సైనస్ అంటే ముక్కు తేమగా ఉండడానికి అలాగే మనం గాలి పీల్చినప్పుడు దుమ్ము జేమ్స్ వంటి కణాలను సైతం బయటికి తరిమేయడానికి సహాయపడుతుందట. కొన్ని కొన్ని సార్లు సైనస్ లోపల ఇన్ఫెక్షన్ వంటివి ఏర్పడతాయి దీనిని సైనసైటిస్ అని పిలుస్తారట.
దీనివల్ల ముక్కు మూసుకుపోవడమే కాకుండా కళ్ళ చుట్టూ చాలా ఒత్తిడి, కళ్ళు తిరగడం, ముక్కునొప్పి, అలర్జీ వంటి సమస్యలు ఏర్పడి తీవ్రమైన సమస్యను సృష్టిస్తాయి.
అయితే సైనస్ తగ్గడానికి చిట్కాలు:
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ సైనస్ ని తగ్గించడానికి సహాయపడతాయి.
తులసి టీ తాగడం వల్ల ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సైనస్ వైరస్ ను చంపే గుణాన్ని కలిగి ఉంటుందట. ఈ టీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల ముక్కునొప్పి, తలనొప్పి, కంటి చుట్టూ నొప్పి ఉన్నా కూడా తగ్గిపోతాయని సమాచారం. అంతే కాదు గొంతు నొప్పి కూడా దూరం అవుతుందట.
ఈ సైనస్ సమస్యతో బాధపడే వారికి ఆవిరి తీసుకోవడం గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుందట. వేడి నీళ్లలో కొన్ని చుక్కలు జండూ బాం లేదా యూకలిప్టస్ ఆయిల్ లేదా పిప్పర్ మెంట్ ఆయిల్ వేసి ఆవిరి పట్టినా సరే నాసికా రంధ్రాలు తెరుచుకొని సమస్యను తగ్గుముఖం పట్టిస్తాయని సమాచారం.