గుండు చేయించుకుంటే ఈ జుట్టు మందమవుతుందా.. నిజం ఏంటంటే?

praveen
ఉరుకుల పరుగుల జీవితం.. డబ్బు సంపాదించాలనె ఆశ.. పెరిగిపోయిన ఖర్చులు.. ఇవన్నీ మనిషిని ఎంతలా ఒత్తిడిలోకి నెడుతూ  ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఇంకో వైపు పెరిగిపోతున్న కాలుష్యం ఇక మారిపోతున్న ఆహారపు అలవాటు ఇవన్నీ మనిషి ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతున్నాయి. దీంతో నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్య సమస్యల గురించి పక్కన పెడితే ఇటీవల కాలంలో మగవాళ్ళను వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టు రాలే సమస్య. చిన్న వయసులోనే ఎంతోమంది బట్టతల వచ్చి ఇబ్బంది పడుతున్నారు.

 అయితే జుట్టు రాలుతున్న సమయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇక ఎంతో మంది డాక్టర్లు చుట్టూ తిరిగినప్పటికీ అటు జుట్టు రాల సమస్య నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. దీంతో పాతికేళ్లు కూడా నిండకముందే పైన పెద్ద క్రికెట్ గ్రౌండ్ తయారైపోతుంది. దీంతో అలాంటి బట్ట తలను దాచుకోలేక.. ఇక బట్టతల ఉంది అని పెళ్లి కాక.. ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే జుట్టు రాలుతున్న సమయంలో ఎంతోమంది కొన్ని రకాల నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటారు. అందులో గుండు చేయించుకోవడం కూడా ఒకటి.

 తలపై జుట్టు రాలిపోతూ పలుచగా మారినప్పుడు గుండు చేయించుకోవడం వల్ల మళ్ళీ తలపై ఉన్న జుట్టు మందంగా మారిపోతుందని ఎంతోమంది విశ్వసిస్తూ ఉంటారు. ఇక ఎంతోమంది ఇష్టం లేకపోయినా గుండు చేయించుకుంటూ ఉంటారు. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. ఇలాంటి నమ్మకంలో ఎలాంటి నిజం లేదు అంటూ చెబుతున్నారు. తలపై హెయిర్ సెల్స్ పుట్టుకతోనే ఉంటాయని గుండు చేయించినంత మాత్రాన వాటి సంఖ్య పెరగదు అంటూ చెబుతున్నారు. అయితే గుండు చేయించడం వల్ల వెంట్రుకలు మాత్రం మందంగా మారే అవకాశం మాత్రం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకానీ గుండు చేయించడం వల్ల తలపై వెంట్రుకల సంఖ్య పెరగదు అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: