షాకింగ్ : వరల్డ్‌లో ఫస్ట్ టైమ్‌.. వర్జినిటీ కోసం ఆపరేషన్.. చివరికి?

praveen
ఈరోజుల్లో మహిళలు చేయించుకుంటున్న సర్జరీల గురించి తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోక తప్పదు. బాడీలోని మొత్తం పార్ట్స్ ను వారు అందంగా, కొత్తగా మార్చుకునేందుకు ఎంతో ఖరీదైన సంక్లిష్టమైన బాధాకరమైన సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా 23 ఏళ్ల బ్రెజిలియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ రవేనా హన్నీలీ హైమెనోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేయించుకోవడానికి సిద్ధమైంది. ఈ శస్త్రచికిత్స ద్వారా కన్యత్వ పొర(హైమెన్)ను పునరుద్ధరించవచ్చు. యోని మీద ఉంటే ఈ పల్చటి పొర శృంగారంతో పాటు అనేక కారణాలవల్ల తెగిపోతుంది.
దాని రిస్టోర్ చేసే హైమెనోప్లాస్టీ శస్త్రచికిత్స కోసం ఆమె దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రవేనాకు 266,000 మంది అనుచరులు ఉన్నారు. ఈ శస్త్రచికిత్స తన ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని ఆమె నమ్ముతున్నారు. అంతేకాకుండా, ఇది తన వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఒక కొత్త మొదలు అవుతుందని ఆమె భావిస్తున్నారు. "నేను మళ్లీ కన్యగా భావించాలనుకుంటున్నాను. ఇది నా ఆత్మస్థైర్యం గురించి, నాకు చాలా ముఖ్యమైన వ్యక్తిగత కారణాల గురించి" అని జామ్ ప్రెస్‌తో మాట్లాడుతూ రవేనా చెప్పారు.
రవేనా హన్నీలీ తాను చేయించుకోబోతున్న హైమనోప్లాస్టి శస్త్రచికిత్స గురించి మరింత వివరాలను పంచుకున్నారు. ఈ శస్త్రచికిత్సలో, చిరిగిన కన్యత్వ పొరను కరిగే దారాలతో కుట్టి, మునుపు ఉన్నట్లుగా కనిపించేలా చేస్తారు. రవేనాకు ఇది కేవలం సౌందర్య శాస్త్రం కంటే ఎంతో ఎక్కువ. ఇది ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి సంకేతం. అయితే, ఇలాంటి శస్త్రచికిత్సలపై ఎల్లప్పుడూ విమర్శలు వస్తున్నాయని రవీనా గుర్తించారు. చాలా మంది ఇలాంటి వ్యక్తిగత నిర్ణయాలను అర్థం చేసుకోలేరు లేదా మద్దతు ఇవ్వరు. "మనం ఇతరులను తీర్పు చేయడం మానేసి, వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించడం ప్రారంభించాలి" అని ఆమె అన్నారు.
అయితే లండన్‌లోని మెడిసోనల్ క్లినిక్ సీఈఓ డాక్టర్ హనా సలుసోలియా మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్స కన్యత్వాన్ని నిజంగా పునరుద్ధరించదని అన్నారు. అంటువ్యాధులు, మచ్చలు వంటి ప్రమాదాల గురించి ఆమె హెచ్చరించారు. కానీ రవేనా హాజరీ చేయించుకోవడానికి మొగ్గు చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: